ఈ మధ్యకాలంలో కొంత మంది యువత ప్రేమ పేరుతో తల్లిదండ్రుల కళ్లుగప్పి అడ్డమైన పనులు చేస్తున్నారు. తొలుత స్నేహితులుగా ప్రారంభమై.. ఇరువురి ఆలోచనలతో ఒకరిపై ఒకరు వ్యామోహం పెంచుకుంటారు. దానికి ప్రేమ అనే పేరు పెడతారు. అలా కొంతకాలం పాటు తెగ ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలో మొదట ప్రేమిస్తున్నట్లు నటించి, ఆ తర్వాత.. తమకు కావాల్సినవి దొరకగానే ఇద్దరిలో ఒకరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలు చేయడంలో అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఉంటున్నారు. ఒకరికి తెలియకుండా, మరొకరితో ప్రేమాయణాలు నడిపిస్తుంటారు. మరికొందరు ప్రేమించిన వ్యక్తిని కాదని మరొకరితో పెళ్లికి సిద్దమవుతారు. ఈ క్రమంలో హత్యలు చేయడానికి సైతం వెనుకాడరు. ఈ కోవకు చెందిన ఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ జిల్లాలోని భాసోరి గ్రామంలో సీమా అనే యువతి ఉంటుంది. ఆమె పొరుగింట్లో రాజేష్ కుమార్ అలియాస్ ఛోటూ అనే యువకుడు ఉండే వాడు. వారిద్దరు ఇరుగుపొరుగు వారు కావడటంతో అప్పుడప్పుడు చూసుకునే వారు. రాజేష్ ఏ ఉద్యోగం చేయకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. అది కాస్తా స్నేహంకి దారి తీసింది. అలా ఒకరి అభిరుచులు మరొకరి నచ్చడంతో ప్రేమించుకున్నారు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు ఊరిబయటకి వెళ్లి ముచ్చట్లు వేసేవారు. అలా కొన్ని నెలలపాటు వారిద్దరి మధ్య ఎఫైర్ సాగింది. ఇలా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకుంటున్న వీరిద్దరి వ్యవహారం పెద్దలకు తెలిసింది. రాజేష్ కు ఉద్యోగం లేకపోవడం వలన, యువతిని అతడికి ఇచ్చి పెళ్లి చేయడానికి సీమా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో సీమాకు వేరే సంబంధం చూడటం మొదటలు పెట్టారు. సీమా కూడా పెళ్లి సంబంధాలకు సిద్దమైంది. ఈ విషయం తెలుసున్న రాజేష్ కోపంతో రగిలిపోయాడు. వెంటనే సీమా వద్దకు వెళ్లి.. తనను పెళ్లి చేసుకోవాలని అడిగడాడు. అతడి పెళ్లి ప్రస్తావనను ఆమె తిరస్కరించింది. దీంతో ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్నాడు రాజేష్. మరోసటి రోజూ అర్ధరాత్రి సీమా ఇంటికి రాజేష్ వెళ్లి.. ఆమె గాఢ నిద్రలో ఉండగా కత్తితో దాడి చేశాడు. పలుమార్లు ఆమె మెడపై పొడిచాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో విలవిల్లాడుతూ అక్కడిక్కడే చనిపోయింది.ఆ తర్వాత.. నిందితుడు పారిపోయాడు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.