ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న ఘోరాలు బాగా పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం, ఆ తరువాత మనస్పర్ధలతో విడిపోవడం చేస్తున్నారు. అయితే కొందరు..ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టిందని దారుణాలకు పాల్పడుతున్నారు. తాాజాగా అలాంటి ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న ఘోరాలు బాగా పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం, ఆ తరువాత మనస్పర్ధలతో విడిపోవడం చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో చనువుగా తిరిగిన ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమింటంటే.. తను ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టిందని కొందరు యువకులు హత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ప్రేమోన్మాద ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా మరో దారుణమైన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రం చిక్కనాయకనహళ్లిలోని బట్టరహళ్లి గ్రామానికి చెందిన సిద్ధరామయ్యకు బి.ఎస్. వినయ్ కుమార్(26) అనే కుమారుడు ఉన్నాడు. అతడు స్థానికంగా ఉన్న సిద్ధరామేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఇక మరొకవైపు దొడ్డబిదరె గ్రామానికి చెందిన జీవిత(17) తన తల్లితో కలిసి వినయ్ ఉండే బట్టరహళ్లిలో నివాసం ఉంటోంది. తుమకూరులో పీయూసీ చదువుతున్న జీవిత.. ఇటీవలే విడుదలైన ఫలితాల్లో పాసైంది. అయితే గత కొంతకాలం నుంచి వినయ్, జీవిత ప్రేమించుకున్నారు. ఇటీవలే వీరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో జీవిత.. వినయ్ ను దూరం పెట్టింది.
అయితే ఆమెతో పలుమార్లు మాట్లాడేందుకు వినయ్ ప్రయత్నించాడని సమాచారం. అయినా అతడితో మాట్లాడేందు జీవిత ససేమిరా అంది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న వినయ్ కుమార్ జీవిత ఇంటికి వెళ్లి కత్తితో ఆమె గొంతుపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో దాడి అనంతరం వినయ్ కుమార్ కనిపించకుండా పోయాడు. చివరకు గ్రామ శివారులో ఉన్న కోనేరులో వినయ్ మృతదేహం కనిపించింది. అలా ఓ యువ జంట ప్రేమ వ్యవహారం.. విషాదంగా ముగిసింది. మరి.. ప్రేమ పేరుతో జరుగుతున్న ఇలాంటి దారుణాలను నిర్మూలించేందుకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.