ఆధునిక సమాజంలో కూడా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ఇంట్లో నుంచి మొదలు బయట వరకు ప్రతి చోట ఆడవారు వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారు. అలానే ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన కొందరు యువతులు నరకం చూస్తున్నారు. తాజాగా ఓ మహిళ కూడా తనకు ఎలాంటి కష్టం రాకుండా భర్త చూసుకుంటాడని నమ్మింది. కానీ ఆమె అలా నమ్మినందుకు ఆ భర్త నరకం చూపించాడు. చివరకి ఘోరం జరిగిపోయింది.
ఆధునిక సమాజంలో కూడా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ఇంట్లో నుంచి మొదలు బయట వరకు ప్రతి చోట ఆడవారు వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారు. వరకట్నం లాంటి వేధింపుల కారణంగా ఎందరో మహిళలు బలవుతున్నారు. అదనపు కట్నం తేవాలని భార్యలను శారీరకంగా , మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొందరు భర్తలు. తాజాగా తిరుపతి జిల్లాలో వరకట్న వేధింపులకు ఓ మహిళ బలైంది. జీవితాంతం సుఖంగా చూసుకుంటాని నమ్మిన ఓ ఇల్లాలికి భర్త నరకం చూపించాడు. ఆ నరకం భరించలేని ఆమె దారుణమైన నిర్ణయం తీసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చేమూరు గ్రామానికి చెందిన సుమలత(25), విజయశేఖర్ భార్యాభర్తలు. సుమలత గ్రామ సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తోంది. విజయశేఖర్ వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. దయనేడుకు చెందిన వెంకటమ్మ కుమార్తె సుమలతను చేమూరుకి చెందిన విజయశేఖర్ తో 2016లో వివాహం జరిగింది. విజయశేఖర్‌కు వరకట్నం కింద రూ.50 వేల నగదు, రెండుసవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది.
కొంతకాలం పాటు భార్యను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు విజయశేఖర్. భర్త చూపిస్తున్న ప్రేమను చూసి ఆమె చాలా సంతోష పడింది. తనను ఏ కష్టం రాకుండా చూసుకుంటాడని ఆమె నమ్మింది. అయితే కొంతకాలనికి భర్త నిజస్వరూపం బయటపడింది. భర్త తరచూ అదనపు కట్నం కోసం సుమలతను వేధించేవాడు. ఈ నేపథ్యంలో గతంలో ఒక్కసారి ఆమె పుట్టింటి వారికి తన భర్త పెట్టే వేధింపుల గురించి చెప్పింది. దీంతో వారు కూడా కుమార్తె సంసారం బాగుండాలని కొంత డబ్బును అల్లుడికి ఇచ్చారు. ఆ సమయంలో కొంత కాలం భార్యను శేఖర్ బాగానే చూసుకున్నాడు.
కొన్ని రోజుల తరువాత మరలా పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని సుమలతను వేధింస్తున్నాడు. ఇక పుట్టింటి వారిని అడగలేక, తాను భర్త పెట్టే నరకం భరించలేకా మానసిక వేదనకు గురైంది. జీవితంపై విరక్తి చెంది ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.