ఇటీవల కాలంలో తరచూ కల్తీ మద్యంకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఈ మద్యం తాగి పదుల సంఖ్యలో అమాయకులు మరణిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తమిళనాడులో కల్తీ మద్యం కారణంగా 22 మంది మృతిచెందారు. తాజాగా ఓ బార్ లో మద్యం తాగి.. ఇద్దరు వ్యక్తులు మరణించారు.
ఇటీవల కాలంలో తరచూ కల్తీ మద్యంకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఈ మద్యం తాగి పదుల సంఖ్యలో అమాయకులు మరణిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తమిళనాడులో కల్తీ మద్యం కారణంగా 22 మంది మృతిచెందగా..50 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటన మరవక ముందే అలాంటి ఘటనే అదే రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ బార్ లో మద్యం తాగిన ఇద్దరు వ్యక్తులు.. తాగిన కాసేపటికే మృతి చెందారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులోని ఓ బార్‌లో ఇద్దరు వ్యక్తులు మద్యం తాగారు. తరువాత కాసేపటికి తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల వివరాలు సేకరించారు. మరణించిన వారు వారు కుప్పుసామీ (68), వివేక్ (36) లుగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఇద్దరు వ్యక్తులు తాగిన మద్యంలో సైనైడ్ కలవడంతోనే చనిపోయినట్లు పోస్ట్ మార్టం నివేదికలో తెలింది.
దీంతో ఘటన స్థానికంగా మరింత చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు బార్‌పై దాడి చేసి..అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఘటన విషయం తెలుసుకున్న తంజావురు జిల్లా కలెక్టర్ దినేష్ ఆలివర్.. అక్కడి చేరుకున్నారు. మద్యంలో సైనైడ్ కలవడంతోనే ఇద్దరూ మృతిచెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వచ్చిన నివేదక ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మద్యంలో సైనైడ్ ఎవరు కలిపారన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అదే విధంగా ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
బార్‌లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని తంజావూరు ఎస్పీ ఆశిష్ రావత్ వెల్లడించారు. ఈ ఘటన ద్వార బార్.. నిబంధనలను అతిక్రమించిందని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన విషయంలో ప్రభుత్వంపై..ప్రతిపక్ష పార్టీలైన అన్నా డీఎంకే, బీజేపీ.. తీవ్ర విమర్శలు గుప్పించాయి. ప్రభుత్వం బార్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం వల్లే తమిళనాడులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డాయి. మరి.. కల్తీ మద్యం కారణంగా సంభవిస్తున్న మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయిండి.