భార్య భర్తల బంధం అంటే అన్యోన్యత కు చిరునామాగా ఉండాలి. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా నీడగా నిలుస్తూ జీవితాన్ని ముందుకు సాగించాలి. ఇద్దురు ఒకరిపైమరొకరు అమితమైన అభిమానాన్ని ప్రేమను చూపిస్తూ ఉండాలి. కానీ ఇటీవలి కాలం లో మాత్రం భార్య భర్తల బంధం లో అన్యోన్యత కాదు అనుమానాలు, మనస్పర్థలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంత మంది భార్యా భర్తల బంధానికి విలువ ఇవ్వకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటే మరి కొంతమంది ఏకంగా కట్టుకున్న భార్యపై అనుమానం తో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా పరాయి వ్యక్తి తో ఫోన్ లో మాట్లాడుతోందనే అనుమానంతో భార్యను పీకనులిపి చంపేశాడు. అడ్డుకోవాల్సిన అత్త మామలు ఇందుకు తోడయ్యారు. కన్న పిల్లల ఎదుటే ఈ దారుణం జరిగిన రోదించడం తప్ప వారేమి చేయలేకపోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పద్మతుల గ్రామానికి చెందిన పిట్ట శ్రీనుకు పుష్ప(30)తో 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు , ఓ అబ్బాయి ఉన్నారు. శ్రీను ఆర్మీలో విధులు నిర్విహిస్తున్నాడు. ఈక్రమంలో కుటుంబానికి దూరంగా గడుపుతుండే వాడు. ఈక్రమంలో భార్య వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని అనుమానంతో ఏడాది క్రితం ఆమె పై దాడి చేశాడు. దీంతో వీళ్ల పంచాయితీ కంచిలి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. దంపతుల మధ్య కలహాల కారణంగా ఇద్దరు అదే గ్రామంలో వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు. ఇటీవల శ్రీను సెలవులపై గ్రామానికి వచ్చాడు. అదే సమయంలో పుష్ప ఇచ్ఛాపురంలో గ్రామదేవత తిరునాళ్లకు పిల్లలతో పాటు తన పిన్ని ఇంటికి వెళ్లింది. అనంతరం తిరిగి వచ్చే సరికి ఆమె ఉంటున్న ఇంటిని శ్రీను పగలగొట్టి కొత్త తాళం వేసుకుని వెళ్లాడు.వాటిని విరగ్గొట్టి లోపలి వెళ్లి పుష్ప ఇంటిని శుభ్రపరించింది. ఈలోపు పిల్లలు వాళ్ల నాన్న ఇంటి వద్దకు వెళ్లారు. ముగ్గురు పిల్లల్ని ఇంటికి పిలిచేందుకు సాయంత్ర భర్త ఇంటికే వెళ్లింది.
ఈక్రమంలో భర్త, అత్తమామలు పుష్పతో దురుసుగా మాట్లాడారు. నీకు పిల్లలు కావాలా అంటూ ఆమె పై దాడికి దిగ్గారు. అత్త సాయమ్మతో కలిసి భర్త.. పుష్పని రోడ్డుపైకి నెట్టేశాడు. మామ నూకయ్య, శ్రీను ఇద్దరూ కలిసి ఆమె పీకనులిమారు. దీంతో ఆమె మృతిచెందింది. మృతురాలి పెద్ద కుమార్తె, ఆమె బంధువు బొచ్చు దాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Samastipur: అమ్మ, నాన్న నాతో పాడు పని చేయిస్తున్నారు! బాలిక సెల్ఫీ వీడియో!