మనిషి ప్రాణం కంటే డబ్బుకే విలువ ఎక్కువగా ఉందని చాలా మంది అభిప్రాయ పడుతుంటారు. అందుకు నిదర్శనంగానే అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వంద, రెండు వందల కోసం మనిషిని హత్య చేసిన ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా రూ.300 కోసం ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు.
నేటికాలంలో డబ్బుకు ఉన్న విలువ మనిషి ప్రాణానికి లేకుండపోతుంది. అందుకే కొందరు డబ్బుల కోసం పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే వంద, రెండు వందల కోసం కూడా మనిషిని దారుణంగా చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం జరగ్గా.. తాజాగా వైఎస్సార్ కడప జిల్లా మరో దారుణం చోటుచేసుకుంది. రూ.300 విషయంలో జరిగిన ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. రూ.300 ఇవ్వలేదని కుమారులతో కలిసి తనకు పని చూపించిన యజమానిని అత్యంత దారుణం హత్య చేశాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వైఎస్సార్ కడప జిల్లా సిద్ధవటం మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన భీమిశెట్టి లక్ష్మీనరసింహా(29) చేనేత మగ్గం పనిచేస్తూ జీవనం సాగిస్తుండే వాడు. అలానే స్థానిక గ్రామ సచివాలయానికి రాత్రి కాపలా దారుగా లక్ష్మీనరసిహం పని చేస్తున్నారు. ఇక తన పెద్దమ్మ ఇంటి ఆవరణలో చెట్టు ఎక్కువగా ఉండటంతో వాటిని తొలగించాలని భావించాడు. ఈ క్రమంలో చెట్లను నరికించడానికి మాధవరం-1 గ్రామంలోని ఎస్కేఆర్ నగర్ కు చెందిన పత్తూరు శ్రీనివాసులను పిలిచాడు. పని పూర్తి చేస్తే.. రూ.600 ఇచ్చే విధంగా లక్ష్మీనరసింహ అతడితో ఒప్పందం చేసుకున్నారు.
ఒప్పదం ప్రకారం శ్రీనివాసులు చెట్లను నరికే పనిని పూర్తి చేశాడు. అనంతరం చెట్టు ఎక్కువగా కొట్టానని, అదనంగా మరో రూ.300 ఇవ్వాలని శ్రీనివాసులు లక్ష్మీనరసింహను డిమాండు చేశాడు. అందుకు లక్ష్మీనరసింహ అంగీకరించక పోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చిన్నగా మొదలైన గొడవ పెద్ద ఘర్షణగా మారింది. ఈక్రమంలోని తన కుమారులను రమ్మని శ్రీనివాసులు ఫోన్ చేసి తెలిపాడు. దీంతో ఆయన కుమారులు మునీంద్ర, నాగేంద్రలు వచ్చి.. లక్ష్మీనరసింహతో వాగ్వాదం పెట్టుకుని, ఇనుప రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే స్థానికులు అక్కడికి చేరుకుని శ్రీనివాసులను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. గాయపడిన లక్ష్మీనరసింహను కడప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతిచెందారు. ఘటనపై శ్రీనివాసులు, ఆయన కుమారులు మునీంద్ర, నాగేంద్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భీమిశెట్టి లక్ష్మీనరసింహ మృతితో ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది. మరి.. ఇలా క్షణికావేశంలో నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్న ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.