నేటికాలంలో ప్రేమ పేరుతో అమ్మాయిలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. కొందరు ప్రేమ పేరుతో అమ్మాయిల వెంటపడి వారిని వేధిస్తారు. అలాంటి వేధింపులను ఎదిరించి కొందరు యువతులు ధైర్యంగా నిలబడతారు. మరికొందరు భయంతో ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తారు. తాజాగా ఓ యువతి కానిస్టేబుల్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్ కి చెందిన దొంగ దొంగరి సంగీత(30) ములుు జిల్లా ఏటూరునాగారం లో ICDS పర్యావేక్షకురాలిగా పనిచేస్తుంది. హనుమకొండ ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సర్వేష్ యాదవ్ ఆమెకు కొద్ది నెలల కిందట పరిచయమయ్యాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ సంగీతకు అతను తరచూ ఫోన్ చేసి వేధించేవాడు. అతని ప్రవర్తనకు సంగీత చాలా విసిగిపోయింది.
ఇదీ చదవండి: మంత్రాలు చేస్తుందని మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన గ్రామస్తులు!
ఈ క్రమంలో సోమవారం రోజువారీ విధులు ముగించుకుని ఇంటికొచ్చిన సంగీత పురుగుల మందు తాగింది. అనంతరం ఆ విషయాన్ని తన సోదరుడికి తెలియజేసింది. వెంటనే పరకాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా సంగీత మృతి చెందింది. మృతురాలి తండ్రి వీరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.