నేటి కాలంలోని అమ్మాయిలు పెళ్లికి ముందు ఓ యువకుడిని ప్రేమించడం, పెళ్లి అయ్యాక కూడా ప్రియుడితో తిరగడం చేస్తున్నారు. చివరకు భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇవే ప్రస్తుత కాలంలో జరుగుతున్న దారుణాలు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ పెళ్లైన మహిళ ప్రియుడి సాయంతో భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బీహార్ లోని సరన్ జిల్లాలో భగవన్ బజార్ పరిధిలోని అజయబ్ గంజ్ గ్రామం. సంతోష్ దాస్ అనే యువకుడికి గోపాల్ కి గాంజ్ ప్రాంతానికి చెందిన సిమ్రాన్ అనే యువతిని ఇచ్చి రెండు నెలల కిందట వివాహం చేశారు. ఇద్దరు కుటుంబాల ఇష్టంతో పెళ్లి ఘనంగా జరిగింది. వధువు కుటుంబ సభ్యులు వరుడికి కోరినంత కట్నం ఇచ్చారు. ఇక పెళ్లై కొన్ని రోజులు గడిచింది. భార్య భర్తలు ఇద్దరు ఎంతో సంతోషంగా కాపురాన్ని సాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే భార్య సిమ్రాన్ తరుచూ ఓ యువకుడితో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు భర్త విన్నాడు. ఎవరో బంధువులు, స్నేహితులు అయి ఉండొచ్చు అని వదిలేశాడు. కానీ సిమ్రాన్ రోజుకు ఎక్కువ సమయం ఫోన్ లోనే గడుపుతుంది.
దీంతో భర్తకు ఆమెపై అనుమానం వచ్చింది. వెంటనే భార్య వద్ద ఉన్న ఫోన్ తీసుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ రాజుకుని మనస్పర్ధలు పుట్టుకొచ్చాయి. ఇక భర్తపై సిమ్రాన్ కోపం పెంచుకుంది. ఎలాగైనా భర్తను లేపెయాలనే నిర్ణయానికి వచ్చింది . ఇందులో భాగంగానే ఇదే విషయాన్ని తన ప్రియుడికి చెప్పింది. ఇద్దరు కలిసి భర్తను హతమార్చే ప్లాన్ గీశారు. ఇటీవల ఇంట్లో భర్త ఒక్కడే ఉండగా సిమ్రాన్ ప్రియుడిని ఇంటికి పిలిచింది. ప్లాన్ ప్రకారం సిమ్రాన్ ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఫ్యాన్ కు ఉరేసి.. వెంటనే సిమ్రాన్ అక్కడి నుంచి పరారైంది.
ఇక సంతోష్ దాస్ మరణంపై కుటుంబం సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో సిమ్రాన్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అందరికి ఆమె పైనే బలమైన అనుమానం కలిగింది. సంతోష్ దాస్ కుటుంబం సభ్యులు మృతుడి భార్య పై స్ధానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిమ్రాన్ ను, అమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.