ఈ మధ్యకాలంలో భార్యభర్తల మధ్య సర్ధుకుపోయే ఆలోచన కరువైంది. ప్రతి చిన్న విషయానికి ఘర్షణ పడుతుంటారు. అలా వారు గొడవలు పడుతుంటే.. పిల్లలు నిత్యం నరకం చూస్తుంటారు. అప్పుడప్పుడు ఈ దంపతుల మధ్య జరిగిన గొడవల్లో దారుణాలు చోటుచేసుకుంటాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు మనస్తాపం చెంది షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటారు. వారు తీసుకున్న నిర్ణయాలతో ప్రాణాలు సైతం పోతాయి. తాజాగా ఓ మహిళ చేసిన పనికి కుటుంబ సభ్యులు ఆందోళ చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో రమేష్, లావణ్య అనే దంపతులు జీవనం సాగిస్తున్నారు. రమేష్ స్థానికంగా ఆటో నడుపుతుండే వాడు. లావణ్య ఇంటి వద్దే టైలరింగ్ పని చేస్తుంది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం వరకు వారి దాంపత్యం అన్యోన్యంగా సాగింది. కొంత కాలం నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారిద్దరు నిత్యం ఘర్షణ పడుతుడేవారు. దీంతో విసుకు చెందిన లావణ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చిన పిల్లలు, భర్తకు లావణ్య కనిపించలేదు. రమేష్ తన బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద ఆచూకీ కోసం గాలించినా ఆమె జాడ తెలియలేదు. దీంతో ఆమె సోదరుడు పెద్ద రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళ చెందుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.