ఈ మధ్యకాలంలో చాలా మంది యువతలో ఓర్పు అనేది కరువైతుంది. ప్రతి చిన్న విషయానికి మనస్తాపం చెంది దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ యువతికి ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు. మరేమైన ఇతర కారణాలు ఉన్నాయే తెలియదు. కానీ క్షణికావేశంలో నిండు జీవితాన్ని నాశనం చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది.
వివరాల్లోలికి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం చిన్నశిర్లాం కు చెందిన అప్పలనాయుడు కుమార్తె మజ్జి పావని. ఈమె ఏఎన్ ఎం శిక్షణ కోసం మూడు నెలల క్రితం శ్రీకాకుళం వెళ్లింది. ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో జనరల్ డ్యూటీ అసిస్టెంట్ గా శిక్షణ తీసుకుంటుంది పావని. తన తోటి విద్యార్థినీలతో కలసి ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటుంది. రోజు వారితో పాటు రిమ్స్ లో విధులు నిర్వహిస్తుండేది. ఈ క్రమంలో సోమవారం పావని స్నేహితులు రిమ్స్ కళాశాలకు వెళ్లారు. అయితే పావని ఎంత సేపటికి ఆసుపత్రికి రాకపోవడంతో అనుమానంతో రూమ్ కి వెళ్లి చూశారు. అక్కడ శ్లాబ్ హుక్ కు వేలాడుతూ కనిపించడంతో తోటి విద్యార్థినీలు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు, మృతురాలి తండ్రికి తెలియజేశారు.
పావని మృతితో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కుమార్తె మూడు నెలల క్రితం ANM శిక్షణ కోసం శ్రీకాకుళం వెళ్లిందని.. ఇంతలోనే ఇలా విగతజీవిగా మారిందని పావని తల్లిదండ్రులు మంగమ్మ, అప్పల నాయుడు కన్నీటి పర్యతమైయ్యారు. తండ్రి, హాస్టల్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఈశ్వర్‌ప్రసాద్ సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని ప్రాధమికంగా దొరికిన ఆధారాల మేరకు అభిప్రాయపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.