నేటికాలంలో కొందరు చేసే పనుల వలన స్నేహమనే మాటకు అర్థం లేకుండా పోతుంది. మిత్రుడి భార్యను సోదరిలా భావించాల్సింది పోయి.. వక్రబుద్దితో చూస్తున్నారు కొందరు. అంతటితో ఆగక వారిని తమ కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నారు. అతంటితో ఆగక ప్రాణాలు తీసుకోవడమో లేదా తీయడమో చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన స్నేహితుడి భార్యపై కన్నేసి వేధించాడు. అతడి వేధింపులు భరించలేని ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆ భయంతో సదరు వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన వివాహిత మౌనిక(24) ఈ నెల 5న అత్త, భర్త, తల్లి అందరూ ఇంటి ముందు మాట్లాడుకుంటుండగా.. పురుగులమందు తాగి..వాంతులు చేసుకుంటూ ఇంట్లో నుంచి బయటకి వచ్చింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను లక్షెట్టి పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను అక్కడి నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. మౌనిక భర్త స్నేహితుడు అదే గ్రామానికి చెందిన మోటపల్కులు ప్రశాంత్(28) ఫోన్ లో ఆమెను నిత్యం వేధిస్తుండటం, ఎవరికి చెప్పుకోలేక మనస్తాపంతో పురుగుల మందు తాగిందని బంధువులు ఆరోపించారు.ఇది ఇలా ఉంటే.. ఆమె మరణ వార్త తెలిసిన ప్రశాంత్ సోమవారం రామగుండం దగ్గర రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుడి భార్యను వేధించడం.. ఆమె ఆత్మహత్యకు పాల్పడటంతో.. అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రశాంత్ కి విహహం అయి ఏడాది పాప ఉంది. ప్రశాంత్.. చేసేది తప్పు అని తెలుసుకుని వేధింపులు ఆపి ఉంటే అటూ ఆ మౌనిక ప్రాణాలు ఇటు అతడి ప్రాణాలు దక్కేవి. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.