నేటికాలంలో అనేక దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భార్యను చంపిన భర్త, ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఇలా అనేక ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అంతేకాక కొందరు ప్రేమికుల మధ్య కూడా గొడవలు జరిగి.. అవి హత్యకు దారితీస్తుంటాయి. ఇటీవలే ఓ ప్రాంతంలో తనను కాదని వేరే మహిళతో చనువుగా ఉంటున్నాడని ప్రియుడు మర్మాంగాన్ని కోసింది ఓ ప్రియురాలు. తాజాగా ఛత్తీస్ గఢ్ లోని ఓ ప్రాంతంలో అలాంటి దారుణమైన ఘటన చోటుచేసుకుంది. డబ్బుల విషయంలో వివాదం తలెత్తడంతో ఓ ప్రియురాలు తన ప్రియుడిని చంపేసింది. అనంతరం మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి.. అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి తగలబెట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాజ్ నంద్ గావ్ చెందిన చంద్ర భూషణ్ అదే ప్రాంతానికి చెందిన రాగిణి సాహు అనే యువతితో ప్రేమలో పడ్డాడు. చాలా కాలం నుంచి వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. రాగిణి కూడా చంద్రభూషణ్ ను గాఢంగా ప్రేమించింది.ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి చంద్రభూషణ్ కనిపించడం లేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులతో పాటు రాగిణి తెగ కంగారు పడింది. తమ కుమారుడు కనిపించడం లేదని చంద్ర భూషణ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కోట్నా సమీపంలోని పానీ అడవుల్లో గుర్తుతెలియని , సగం కాలిని శవం కనిపించింది.
అదే విషయాన్ని స్థానికులు వెంటనే పోలీసులుకు తెలియజేశారు. దీంతో వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని.. చుట్టుపక్కల పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించగా అది చంద్రభూషణ్ దిగా గుర్తించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో పాటు ప్రియురాలు రాగిణిని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో వారికి ప్రియురాలు రాగిణి చెప్పే మాటలపై సందేహం వ్యక్తమైంది. దీంతో రాగిణి సాహును అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు బయటకి వచ్చాయి. ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటున్న సమయంలో రాగిణి అడగటంతో చంద్ర కొంత మొత్తంలో డబ్బులు అప్పుగా ఇచ్చాడు. ఈ డబ్బుల విషయంలో ఇద్దరికీ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలోనే చంద్రభూషణ్ వివిధ విషయాలపై ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేసి వేధించాడు. దీంతో వేధింపులు విసుగు చెందిన రాగిణి.. అతడిని చంపేందుకు పథకం వేసింది. తన మరో స్నేహితుడు నూతన సాహు సాయంతో చంద్రభూషణ్ ను రాగిణి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి అడవిలోకి తీసుకెళ్లి.. తగులబెట్టింది. దీంతో నిందితురాలైన రాగిణి సాహును పోలీసులు అరెస్టు చేశారు. మరి.. ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.