ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చటి సంసారాలను రోడ్డున పడేయడమే కాకుండా నిండు జీవితాలను ఆగం చేస్తున్నాయి. ఇలా పరాయి వాడిలో మోజులో పడి కొందరు సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు ఆడవాళ్లు అయితే భర్త, పిల్లలను కాదని పరాయి వాడి శరీరం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అలానే ఓ మహిళ.. కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలను కాదని పక్కంటి యువకుడితో అక్రమసంబంధం పెట్టుకుంది. చివరికి అతడి నిజస్వరూపం తెలిసి ఎదురు తిరగటంతో ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ జిల్లాకు చెందిన ఓ వివాహితకు భర్త, ముగ్గురు పిల్లున్నారు. కొన్నాళ్లు హాయిగా సాగిన వారి సంసారంలో ఇటీవల విభేదాలు మొదలయ్యాయి. అలా వారు నిత్యం ఘర్షణ పడుతుండే వారు. ఈ క్రమంలో ఆమెకు ఓ యువకుడు పరిచయమయ్యాడు. అతడితో తన కుటుంబ విషయాలు పంచుకునేది. ఇదే సమయంలో వాడు ఆ ఆంటీని శారీరకంగా వాడుకోవాలని ప్లాన్ వేశాడు. అందుకోసం భార్యభర్తల మధ్య ఇంక విభేదాలు వచ్చేలే ఆంటీకి మాటలు చెప్పేవాడు. ఈ క్రమంలో ఆమె యువకుడి ప్రేమలో పడింది. ప్రేమ అనే కంటే అతడి మోజులో పడింది. ఇది వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. యువకుడితో పడక సుఖం పంచుకున్న ఆమె వాడిని వదల్లేక పోయింది. వాడి మాయలో పడి భర్త, పిల్లలను వదిలేసి అతనితో వెళ్లిపోయింది.
అలా అతడితో వెళ్లిన ఆమెకు అసలు విషయం తెలిసింది. వాడికి ఇదివరకే పెళ్లి అయినట్లు తెలిసింది. దీంతో అతడిని నిలదీయగా తన భార్యకు విడాకులు ఇస్తానని మాయ మాటలు చెప్పాడు. అనంతరం ఆమెను వాడుకుని.. డబ్బుల కోసం వేధించసాగాడు. దీంతో ఆ మహిళ తన పుట్టింటికి వెళ్లింది. ఆమెపై కోపం పెంచుకుని అతడు తన స్నేహితుడితో కలసి ఆమె ఇంటికి వెళ్లి దాడి చేశాడు. ముక్కు, వెంట్రుకలు కత్తిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె ప్రియుడిని, అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు. చూశారా..చక్కటి సంసారాన్ని వదిలి పరాయి వాడి శరీరం కోసం వెళ్లే వారికి ఇలాంటి పరిస్థితులే వస్తాయి. కొన్ని సందర్భాల్లో హత్య గురవుతారు కూడా. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.