దేవుళ్లకు ఎన్నో పూజలు చేసినా ఆమెకు పిల్లలు కలగలేదు. దీంతో అక్క కూతుర్ని తెచ్చుకుని కంటిక రెప్పలా చూసుకుంటూ పెంచి పెద్ద చేసింది. అలా కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటూ బాగా చదివిస్తోంది. చదువు పూర్తయ్యాక మంచి సంబంధిం చూసి పెళ్లి చేయాలని భావించింది ఆ మహిళ. అయితే ఆ బాలిక మాత్రం ఆ మహిళ ఆశలను అడియాశలు చేసింది. ఆ బాలిక బుద్ధి చెడు మార్గం వైపు చూసింది. ప్రేమ అంటే ఏమిటో అర్ధం తెలియని వయస్సులో ప్రేమలో పడింది. అంతటితో ఆగక పెంచిన ప్రేమను మరచి.. ప్రియుడితో కలసి ఆ మహిళను దారుణగా హతమార్చింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుుకుంది. వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ లోని నసీరాబాద్ ప్రాంతంలో బేలా జాన్సన్(48) అనే మహిళకు పిల్లలు లేరు. ఎన్నో ఆస్పత్రులకు తిరిగినా, దేవుళ్లకు పూజాలు చేసిన ప్రయోజనం లేకపోయింది. దీంతో చివరకి తన అక్క కూతురును తెచ్చుకుని, చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసింది. ఈ క్రమంలో బాగా చదివిస్తూ వస్తోంది. అయితే చదువు పూర్తయ్యాక మంచి సంబంధం చూసి వివాహం చేయాలని కలలు కనేది. అయితే ఆమె ఆశలకు అనుగుణంగా ఆ బాలిక నడుచుకునేది కాదు. చిన్న వయస్సులోనే అదే ప్రాంతంలో ఉండే గౌతమ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. తనను పెంచిన అమ్మకు తెలియకుండా ప్రియుడితో రోజూ తిరిగేది. ఈక్రమంలో తన ప్రియురాలిని పెంచిన తల్లి ఆస్తిపై ఆ యువకుడు కన్నేశాడు.
ఈ క్రమంలో ఆ బాలికను పెళ్లి చేసుకుంటే బేలా ఆస్తి తన సొంతమవుతుందని భావించాడు. ఇదే విషయాన్ని బాలికతో చెప్పగా.. ఆమె కూడా ఇందుకు అంగీకరించింది. ముందుగా తామిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని బాలిక.. బేలాతో తెలిపింది. దీంతో వారి పెళ్లికి బేలా ఒప్పుకోలేదు. దీంతో చివరకు బేలాను చంపేయాలని వారిద్దరు నిర్ణయించుకున్నారు. ఈ క్రమం ప్రియుడు సలహా మేరకు ఒకసారి కూరలో విషం ఇచ్చి చంపే ప్రయత్నం చేసి విఫలమైంది. ఆ తర్వాత కూడా మరో రెండు సార్లు బేలాను చంపేందుకు ఆ బాలిక విఫలయత్నం చేసింది. ఈక్రమంలో ఆదివారం మరోసారి చంపేందుకు వారిద్దరు సిద్దమయ్యారు.
రాత్రి 10గంటల సమయంలో గౌతమ్.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రియురాలి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ నిద్రిస్తున్న బేలా జాన్సన్ ను గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని సమీపంలో ఉన్న బావిలో పడేసి పారిపోయారు. బేలా బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చివరకు బావిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక, ఆమె ప్రియుడితో సహా హత్యకు సహకరించిన వారిని పోలీలుసు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.