తమ బిడ్డలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించి.. పెళ్లి చేసుకుని పిల్లల పాపలతో హాయిగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అలానే రేయింబవళ్లు కష్టపడి పనిచేసి వారిని చదివిస్తుంటారు. మరికొందరు తల్లిదండ్రులు పిల్లల బాగా చదివించడం కోసం దుబాయ్ సైతం వెళ్తుంటారు. అయితే చాలా మంది పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల కష్టాలను అర్ధం చేసుకుని.. కష్టపడి చదివి ఉన్నత స్థితికి ఎదుగుతుంటారు. అయితే మరికొంత మంది అలా మంచి స్థాయికి ఎదుగుతున్న క్రమంలో విధి వక్రీకరించి.. తిరిగి రాని లోకాలకు వెళ్తారు. ఇలా బిడ్డల అకారణ మరణంతో వారి తల్లిదండ్రులకు తీరని గుండెకోత మిగులుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తల్లిదండ్రుల చేతికి అందివచ్చిన యువతి రోడ్డు ప్రమాదంలో మరణించింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. ఇక బాధితులు కథనం ప్రకారం..
తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామానికి చెందిన వీర్రాజు, నాగమణి దంపతులకు ఇద్దరు కూతుర్లు. వారి చిన్న కుమార్తె ఎల్లే రత్నమాల(19), రాజమండ్రికి చెందిన సుధారాణి అనే యువతులు మంచి స్నే హ్నితులు. వీరిద్దరు శుభకార్యాల్లో మేకప్, మెహందీ పెట్టడం వంటివి చేస్తుంటారు. ఎల్లే రత్నమాల తండ్రి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాగమణి ఉపాధి కోసం మూడు నెలల క్రితం దుబాయ్ కి వెళ్లింది. పెద్ద కుమార్తెకి వివాహం జరగ్గా.. రెండో కుమార్తె రత్నమాల మెహందీ, మేకప్ లు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. రత్నమాల, సుధారాణి శుభకార్యాల్లో మెహందీలు పెడుతూ డబ్బులు సంపాదిస్తుండేవారు.
ఇదే క్రమంలో శుక్రవారం ఓ శుభకార్యంలో మెహందీ పెట్టేందుకు మరో స్నేహితుడి కాశీతో కలిసి రాజమహేంద్రవరం నుంచి అమలాపురం బయలుదేరారు. కాశీ బైక్ నడుపుతుండగా ఇద్దరు యువతులు వెనుక కూర్చున్నారు. అయితే రావులపాలెంలోని సీఐ కార్యాలయం వద్ద ఉన్న వంతెన మీదకు వచ్చేసరికి వెనుక వస్తున్న లారీ.. వీరి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా బైక్ పై నుంచి ముగ్గురూ కిందపడిపోగా.. రత్నమాల తలపై నుంచి లారీ చక్రాలు దూసుకపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన వారిని కొత్తపేట ఆసుపత్రికి తరలించగా.. రత్నమాల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కుమార్తె మృతితో రత్నమాల ఇంట్లో విషాదం నెలకొంది. బతరుకుదెరువు కోసం రత్నమాల తల్లి నాగమణి మూడు నెలల క్రితమే దుబాయి వెళ్లింది. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. మరి.. ఇలా కొందరి నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పొతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.