సాధారణంగా పోలీసులు అంటే అందరికి ఓ రకమైన భావన ఉంటుంది. విధుల్లో భాగంగా కఠినంగా వ్యహరించడంతో వారంటే ప్రజల్లో భయం ఉంటుంది. కానీ వారిలో మానవత్వం కూడా ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో రుజువైయింది. తాజాగా ఓ మహిళ ఎస్సై గుర్తు తెలియని అనాథ శవాన్ని స్వయంగా తానే మోసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఏకంగా మూడు కిలో మీటర్ల ఆ శవాన్ని మోసి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం హాజీపురం అటవీ ప్రాంతంలో సుమారు 65 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినాడు. ఆ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్సై పావని, సీఐ పాపారావులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయి ఉంది.
ఆ మృతదేహం ఉన్న ప్రాంతం రహదారికి దూరంగా ఉంది. వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కానిస్టేబుల్ సాయంతో ఎస్సై కృష్ణ పావని మృతదేహాన్ని ఓ కర్రకు కట్టి మూడు కిలోమీటర్ల దూరం మోసుకొచ్చారు. అక్కడి నుంచి కనిగిరి ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషయం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహిళా ఎస్సై చేసిన ఈ మంచి పనికి సోషల్ మీడియాల్లో ప్రశంసల వెల్లువ పొగింది.
గతేడాది కూడా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి తరహా ఘటనే జరిగింది. కాశీబుగ్గ ఎస్సై కొత్త శిరీష
దాదాపు కిలోమీటరు మేర అనాధ శవాన్ని మోసుకుంటూ వచ్చి లలితా ఛారిటబుల్ ట్రస్ట్ వారికి అప్పగించారు.. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం తెలియడంతో అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ ..ఎస్సై శిరీషను ఫోన్ చేసి అభినందించారు. మళ్లీ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఎస్సై పావని కూడా ప్రశంసలు అందుకున్నారు. మరి..ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.