సమాజంలో రోజు రోజూకి వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటి కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ అక్రమ బంధాల కారణంగా పచ్చని కాపురాల్లో నిప్పులు రేగుతున్నాయి. ఈ అక్రమ సంబంధాల కారణంగా జీవితాలు బుగ్గిపాలవుతున్న ఘటనలు చూసి కూడా ఇంకా కొందరు అటువైపు పరుగులు తీస్తున్నారు. భాగస్వామికి తెలియకుండా పరాయి వారితో పడక సుఖం పంచుకుంటున్నారు. పరాయి శరీరంతో సరసంకి అలవాటు పడి.. భాగస్వామిని హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఓ మహిళ అలాంటి దారుణానికి తెగబడింది. ప్రియుడితో పడక సుఖం పంచుకునేందుకు అడ్డుగా వస్తున్నాడని భర్తను హత్య చేయించింది. ప్రియుడితో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని క్యాబిన్ పేటకు చెందిన బడుగు నవీన్(35)కి శివ పార్వతీ అనే ఆమెతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. నవీన్ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెళ్లైన తరువాత కొంతకాలం పాటు నవీన్ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవించారు. అయితే కొంతకాలం తరువాత శివపార్వతీ బుద్ధి చెడు మార్గం వైపు వెళ్లింది. భర్త సుఖాన్ని కాదని పరాయి వ్యక్తివైపు మనస్సు మళ్లింది. స్థానికంగా ఉండే మేడికొండ శ్రీను అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు తెలియకుండా శివ పార్వతీ, శ్రీనుతో అక్రమ సంబంధం కొనసాగించింది.
ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 27 నుంచి నవీన్ కనిపించడం లేదని అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో నవీన్ భార్య కనిపించకపోవడంతో అనుమానం వచ్చి ఆమె కోసం గాలించారు. శివపార్వతీ, ఆమె ప్రియుడు శ్రీనుతో కలిసి పారిపోయినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆ ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తే.. ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నవీన్ తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నవీన్ ను హత్య చేసి బాపట్ల మండలం గుడిపూడి గ్రామ శివారులోని తుంగభద్ర మురుగు కాలువలో పడేసినట్లు వారు తెలిపారు. దీంతో నిందితులను తీసుకుని తుంగభద్ర కాల్వ వద్దకు వెళ్లి మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఇంకా నవీన్ మృతదేహం లభ్యం కాలేదు. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని నవీన్ ని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.