ప్రేమ.. వర్ణించలేని భావన.. చూడ్డానికి రెండు అక్షరాలే.. కానీ దాని వెనుక రెండు మనసులు ఉంటాయి.. ఇద్దరి ఇష్టాలూ ఉంటాయి. నేటి సమాజంలో యువతి, యువకులు ప్రేమించుకోవడం సర్వసాధారణం అయ్యింది. తాజాగా ఓ ప్రేమ జంట తమ ప్రేమను గెలిపించుకొవడానికి వెళ్తూ.. ఓడిపోయింది. మరి ఈ ప్రేమజంటకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..
వారిద్దరూ ప్రేమించుకున్నారు.. తమ ప్రేమను పెద్దలు అంగీకరిస్తారో? లేదో అన్న అనుమానంతో దూరంగా వెళ్లి పోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదాని ప్రకారమే బైక్ పై బయలుదేరారు. కానీ మధ్యలోనే వారి ప్రేమను విధి రోడ్డు ప్రమాదం రూపంలో బలి తీసుకుంది. పిఠాపురం పట్టణ ఎస్సై శంకరరావు తెలిపిన వివరాల ప్రకారం..
కాకినాడ జగన్నాథపురానికి చెందిన పాలెపు గణేష్, అదే ప్రాంతానికి చెందిన దీప్తి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం రాత్రి తాము అన్నవరం వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బైక్ పై అర్ధరాత్రి బయలు దేరారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పిఠాపురం రాపర్తి సెంటర్‌కు వచ్చే సరికి 216 జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను వీరి వాహనం బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి 108లో తరలించారు. గణేష్ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందగా.. దీప్తి చికిత్స పొందుతోంది. కాగా తమ కుమారుడిని ఎవరో వ్యక్తులు చంపేశారని మృతుడి తల్లి లక్ష్మి పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విధి విడదీసిన ఈ ప్రేమ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రెండున్నరేళ్లుగా ఇంట్లోనే డెడ్ బాడీ.. అసలు విషయం తెలిసి ఖంగుతున్న పోలీసులు!
ఇదీ చదవండి: నీరవ్ మోదీకి ఈడీ ఝలక్.. రూ.253 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం!