చెల్లెలు చనిపోయన విషయాన్ని దాచిపెట్టి.. శవంతో అక్క ఏకంగా నాలుగు రోజులు ఇంట్లో ఉంది. దుర్వాసన రావడంతో స్థానికులకు విషయం తెలిసింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ప్రగతినగర్‌లో చోటు చేసుకుంది. శ్వేత, స్వాతి ఇద్దరు అక్కాచెల్లెళ్లు. తల్లి చనిపోయింది. తండ్రి వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఈ క్రమంలో చెల్లి శ్వేత(24) చనిపోయింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది స్వాతి. శ్వేత కనిపించడంలేదని స్థానికులు స్వాతిని ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు.
నాలుగు రోజుల తర్వాత వాళ్ల ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు వెళ్లి చూడగా.. శ్వేత శవం పక్కన స్వాతి కూర్చోని ఉంది. దీంతో స్థానికులు షాక్ తిన్నారు. ఇద్దరి మానసిక పరిస్థితి బాగాలేదని స్థానికులు తెలిపారు. గతంలో తల్లి చనిపోయిన సమయంలో కూడా ఇద్దరు అక్కాచెల్లెళ్లు రెండు రోజుల పాటు శవంతోనే ఇంట్లోనే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు సమచారం అందించగా.. వారే శ్వేత దహన సంస్కారాలు చేశారు.
ఇదీ చదవండి: అర్ధరాత్రి భర్తను బంధించి.. భార్యను బెదిరించి