ఈ మధ్యకాలంలో అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. వావివరుసలు, రక్తసంబంధాలు, పేగు బంధాలు ఇలా ఒకటేంటి అన్ని మంటకలిసిపోతున్నాయి. సమాజం ఎటు వెళ్తుందో కూడా అర్ధంకాని పరిస్థితి. తండ్రి అంటే బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ రక్షణ కల్పించాడు. అయితే ఓ తండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి కన్నబిడ్డలపైనే తన కామవాంఛను తీర్చుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఇంట్లో ఉంటున్న కూతరిపై ఈ దారుణానికి పాల్పడుతూ వచ్చాడు. తండ్రి చేస్తున్న అఘాయిత్యాలపై ఎదురు తిరిగిన ఆ యువతిపై కుటుంబ సభ్యులే బెదిరింపులకు దిగారు. బాధితురాలు తెలిపిన ప్రకారం.
హర్యానా పానిపట్‌లోని పారిశ్రామిక వాడలో ఉంటున్న ఓ మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. తండ్రే గత కొన్ని సంవత్సరాలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది. రాత్రి నిద్రపోతున్న సమయంలో తండ్రి తన దగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించి.. అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. ఇదే విషయాన్ని తల్లితో పాటు కుటుంబ సభ్యులకు చెబితే పట్టించుకోలేదని తెలిపింది. వారు పట్టించుకోకపోవడంతో బాధితురాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. తన దగ్గరున్న ఆధారాలను చూపించడంతో పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
తండ్రి హింస పోయిందనుకుంటున్న ఆ బాధితురాలిని కుటుంబ సభ్యులు బెదిరించడం మొదటలు పెట్టారు. కన్న తండ్రినే జైలుకు పంపిన దుష్టురాలివి, కుటుంబ పరువు తీశావంటూ, తనను చంపేస్తామని బెదిరించారని బాధితురాలు వాపోయింది. తన కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని ఎలాగైనా కాపాడమంటూ అందరిని వేడుకుంటోంది. తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన ఈ అమ్మాయి తన బాధ తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో ఆమె అక్క కూడా స్పందించింది.
పదేళ్ల క్రితం తన తండ్రి చెల్లెలిని ఇప్పుడు వేధిస్తున్నట్లుగానే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అతడ్ని కఠినంగా శిక్షించాలని, తన సోదరికి, తనకు రక్షణ కల్పించాలని ఆ రాష్ట్ర సీఎంకి లేఖ రాసింది. తండ్రి పరువు కోసం అన్నీ భరించిన తాను చెల్లెలి జీవితం నాశనం కావడం ఇష్టం లేకే ఈవిధంగా లేఖ రాస్తున్నానని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆడపిల్లల వీడియో, లేఖలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.