నేటికాలంలో చాలామంది యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి కొరవడుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయ పడిపోతున్నారు. తాము జీవితంలో ఇంకేమి సాధించలేమని తీవ్ర నిరాశలకు లోనవుతున్నారు. కొందరు పరీక్షల్లో ఫెయిల్ అయినా, ఉద్యోగం రాకపోయినా, పెళ్లికాక పోయినా తీవ్ర మానసిక వేదనకు గురై.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.
నేటికాలంలో చాలామంది యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి కొరవడుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయ పడిపోతున్నారు. తాము జీవితంలో ఇంకేమి సాధించలేమని తీవ్ర నిరాశలకు లోనవుతున్నారు. కొందరు పరీక్షల్లో ఫెయిల్ అయినా, ఉద్యోగం రాకపోయినా, పెళ్లికాక పోయినా తీవ్ర మానసిక వేదనకు గురై.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. తమ యోగక్షేమాల గురించి ఆలోచించే తల్లిదండ్రులు మందలించిన కూడా కొందరు యువత బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ప్రేమ నేపథ్యంలో తల్లిదండ్రులు మందలించారని ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. అమ్మానాన్నలు మందలించారని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం..
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డి పల్లికి చెందిన బోలారం అనే వ్యక్తి స్థానికంగా వ్యాపారం చేసుకుంటూ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. బోలారంకు సంగీత అనే 18 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె స్థానికంగా ఓ టైలరింగ్ సెంటర్ లో శిక్షణ చీసుకుంటోంది. బోలారం దంపతులకు సంగీత అంటే ఎంతో ఇష్టం. ఆమెను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునే వారంట. అయితే ఇటీవల కొంతకాలం నుంచి ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతున్నట్లు సమాచారం. అలానే ప్రేమ వ్యవహారంలో సోమవారం ఉదయం సంగీత తల్లిదండ్రులు ఆమెను మందలించారు.
దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై.. సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి.. అందులో దూకినట్లు పోలీసులు వివరించారు. అయితే బయటకు వెళ్లి.. ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు సంగీత కనిపించలేదు. అయితే తల్లిదండ్రులు టైలరింగ్ కేంద్రానికి వెళ్లి ఉంటుందని భావించారు. చీకటి పడుతున్న కూడా ఇంటికి రాకపోవడంతో యువతి తల్లిదండ్రుల సందేహం వ్యక్తమైంది. దీంతో కుమార్తె ఆచూకి కోసం తల్లిదండ్రులు టైలరింగ్ కేంద్ర వద్ద విచారించారు. ఇక్కడి రాలేదని టైలరింగ్ శిక్షణ కేంద్రం వాళ్లు తెలపడంతో … తమకు తెలిసిన వారిని విచారించారు. అయినా సంగీత ఆచూకీ లభ్యం కాలేదు.
కుమార్తె కోసం వెతుకుతున్న సమయంలోనే చెరువులో తేలుతున్న మృతదేహాన్ని కొందరు యువకులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని చెరువులో మృతదేహాన్ని బయటకు తీసి లభించిన వస్తువల ఆధారంగా సంగీతగా గుర్తించారు. ఆ తరువాత మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.