సాధారణంగా రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. అందుకే వారు ఎక్కడికి వెళ్లినా కూడా సెక్యూరీటి లేనిదే అడుగు బయటపెట్టరు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు భద్రత ఎంతో కట్టుదిట్టంగా ఉంటుంది. అయితే ఎంతో పటిష్టమైన భద్రత ఉన్నప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో సదరు ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఘటనలు మనం అనేకం చూశాం. అయితే తాజాగా మరో ఘోర ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిపైనే కాల్పులకు తెగపడ్డాడు ఓ ఎఎస్సై. ఈ కాల్పులో గాయపడిన ఆ మంత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నబ కిషోర్ దాస్ ఝుర్పుగూడ జిల్లాలోని బ్రెజిరావ్ నగర్ లో ఓ కార్యక్రమానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో గాంధీ చౌక్ వద్దకు రాగానే నబ కిషోర్ పై సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న చంద్రదాస్ కాల్పులు జరిపాడు. మంత్రికి అతిసమీపంలోకి వెళ్లిన చంద్రదాస్.. ఛాతిపై రెండు రౌడ్ల కాల్పులు జరిపాడు. కుప్పకూలిపోయిన మంత్రిని మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ లో భువనేశ్వర్ అపోలో ఆసుపత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేసి పర్యవేక్షణలో ఉంచగా ఆదివారం రాత్రి 7.30 గటంల ప్రాంతంలో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
నడి రోడ్డులో మంత్రిపై కాల్పులు జరపడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో బీజేడీ కార్యకర్తలు, నాయకులు ధర్నాకు దిగారు. మరొక వైపు కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఆసక్తికర విషయం తెలిసింది. అతడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు, ఈ క్రమంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లు అతడి భార్య మీడియాకు వెల్లడించారు. ఈ వ్యాధి చికిత్స కోసం గత పదేళ్ల నుంచి మందులు వాడుతున్నట్లు ఆమె తెలిపారు. ఎప్పుడు సెలవులు అడిగినా కూడా అధికారులు ఇవ్వడటంలేదని తనకు ఫోన్ చేసి బాధపడేవాడని ఆమె తెలిపారు.
నబ కిశోర్ దాస్.. 1962 జనవరి 7 ఝూర్సుగూడలో జన్మించారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరిన నబా కిశోర్ దాస్ ఝూర్సుగూడ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2014లో కూడా మరోసారి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. అనంతరం రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా కాంగ్రెస్ కు రాజీనామా చేసి 2019లో బీజేడీలో చేరి.. ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచారు,. నవీన్ పట్నాయక్ మంత్రి వర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. ఇలా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న కిశోర్ దాస్ ఇలా హత్యగావింప పడ్డారు. మరి.. ప్రజాప్రతినిధుల పై జరుగుతున్న దాడులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
అందరూ చూస్తుండగా మంత్రిని కాల్చిన పోలీస్!! pic.twitter.com/awQhcE4Urx
— venky bandaru (@venkybandaru13) January 29, 2023