ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవ్వరం చెప్పలేము. ఎంతో మంది ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకుని పెళ్లి పీటల వరకు వెళ్లారు. అయితే నేటికాలంలో వాట్సాప్ మెసేజ్ వచ్చిన త్వరగా యువత మధ్య ప్రేమ పుడుతుంది. అలానే మెసేజ్ ను డిలీట్ చేసినంత ఈజీగా విడిపోతున్నారు. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రియుడు మోసం చేశాడనే కారణంతో ఓ యువతి దారుణ నిర్ణయం తీసుకుంది.
ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవ్వరం చెప్పలేము. ఎంతో మంది ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకుని పెళ్లి పీటల వరకు వెళ్లారు. అయితే నేటికాలంలో వాట్సాప్ మెసేజ్ వచ్చిన త్వరగా యువత మధ్య ప్రేమ పుడుతుంది. అలానే మెసేజ్ ను డిలీట్ చేసినంత ఈజీగా విడిపోతున్నారు. కొందరు మాత్రం తమ లవర్ ను ఎంతో గాఢంగా ప్రేమిస్తుంటారు. వారితోనే జీవితాన్ని ఊహించుకుంటారు. తమ లవర్ ఇతరులతో మాట్లాడిన, తనను ప్రేమించి మోసం చేసిన తట్టులేరు. ఈ క్రమంలో హత్య లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి కూడా ప్రియుడు మోసం చేశాడని కారణంతో మనస్తాపం చెంది.. ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్ జిల్లా మానిక్ బండార్ తండాకు చెందిన కెలోత్ రాజేశ్వరి(19)కి.. అదే గ్రామానికి చెందిన అభిలాష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొంతకాలం స్నేహంగా కొనసాగింది. ఆ తరువాత స్నేహంగా కాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో వీరిద్దరు నాలుగేళ్లుగా ప్రేమంచుకుంటున్నారు. అలానే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే కాస్తా డబ్బులు కూడా సంపాదించుకోవాలని ఇరువురు భావించారు. ఈ క్రమంలో రాజేశ్వరి హైదరాబాద్ వెళ్లి.. ఓ బంగారు దుకాణంలో పని చేస్తోంది.
ఆమె హైదరాబాద్ వచ్చిన తరువాత కూడా ఇద్దరు తరచూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్లు. అలా చాలా కాలం పాటు ఇద్దరు బాగానే ఉన్నాయి. అయితే రాజేశ్వరి దూరంగా ఉండటంతో అభిలాష్ లో ఆలోచన మారింది. అతడు మరో యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెతో ప్రేమలో మునిగి తేలుతూ రాజేశ్వరిని పట్టించుకోలేదు. రాజేశ్వరి ఫోన్ చేస్తుంటే వెయిటింగ్ రావటం, తిరిగి స్పందించకపోవటం చేసేవాడు. ఒకవేళ ఫోన్ ఎత్తినా తిట్టడం, ఇతరులతో సంబంధాలు అంటగట్టడం చేసేవాడు. అభిలాష్ తో మాట్లాడేందుకు రాజేశ్వరి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చింది.
ఇదే సమయంలో అభిలాష్.. మరో యువతిలో క్లోజ్ గా ఉండటం రాజేశ్వరి గమనించిందని సమాచారం. అదే విషయంపై ఆమె అభిలాష్ ను నిలదీసింది. “మనం పెళ్లి చేసుకుందామనుకున్నాం కదా..మరో అమ్మాయితో ఎందుకు చనువుగా ఉంటున్నావు” అని నిలదీసిందని సమాచారం. ” ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. నీతో నాకు సంబంధం లేదు” అని అభిలాష్ అన్నాడు. దీంతో రాజేశ్వరి తీవ్ర మనస్తాపానికి గురైంది. తండ శివారులో గత నెల29న గడ్డిమందు ఆత్మహత్యయత్నం చేసింది.
అపస్మారక స్థితిలో ఉన్న రాజేశ్వరిని గమనించిన స్థానికులు వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం ఉదయం చికిత్స పొందుతు మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఇలా ప్రేమ పేరుతో మోసపోయి.. నిండు జీవితాలను బలి చేసుకుంటున్న యువతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.