శారీరక సుఖం కోసం కొందరు పవిత్రమైన వివాహబంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ వివాహేతర సంబంధాల వైపు పరుగులు పెడుతున్నారు. వదిన, మరిది, అత్త, అల్లుడు అనే వావివరుసలు మరచి శారీరక సుఖమే ముఖ్యమని అడ్డదారులు తొక్కుతున్నారు. చివరికి ఈ సంబంధాలే.. హత్యలు చేయడానికి, హత్యకు గురి కావడానికి దారితీస్తున్నాయి. తాజాగా మరిదితో ఓ వదిన వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరికి ఆ మరిది చేతిలోనే హత్యకు గురయ్యింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన చిన్నమామ కుమారుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరు నిత్యం కామక్రీడలో మునిగితేలేవారు. చెడు మార్గాలు ఎప్పుటికైనా ప్రమాదమే అని తెలిసి కూడా వారు రాసలీలలు కొనసాగించారు. కొన్నాళ్లకు వదినతో ఉన్న శారీరక సంబంధం కారణంగా ఆమెను డబ్బులు అడగటం మొదలు పెట్టాడు ఆ మరిది. దీంతో వీరిద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవలు మొదలయ్యాయి. వివాహేతర సంబంధం కాస్తా డబ్బు బంధంలోకి వెళ్లి ఘర్షణలు పెరిగాయి. ఈ క్రమంలో వదినని హత్య చేయాలని ప్లాన్ వేశాడు. అనుకున్న ప్రకారం ఆమెను కొండ గుట్టలోకి తీసుకెళ్లి హత్య చేశాడని తెలిసింది.
హత్య అనంతరం తనకు ఏమి తెలియనట్లు నటిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులతో కలసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమ వదిన కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన వదిన వివరాల గురించి ఆరా తీసేవాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించే సరికి అతగాడు అసలు విషయం చెప్పినట్లు సమాచారం. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.