ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు చేయటం లేదంటే ఆత్మ హత్యలు చేసుకోవడం వంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి అక్రమ సంబంధాల మైకంలో పడి నేటి కాలం కొందరు భార్యా భర్తలు పచ్చని కాపురాల్లో చేజేతులా నిప్పులు చిమ్ముకుంటున్నారు. ఇదిలా ఉంటే నిజామాబాద్ జిల్లాలో ఓ భార్యాభర్తలు ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు సీక్రెట్ గా వివాహేతర సంబంధాలు కొనసాగించారు. కొన్నాళ్ళకి వీళ్లిద్దరి చీకటి సంసారాల విషయాన్ని ఒకరినొకరు సీక్రెట్ గా తెలుసుకున్నారు. అనంతరం ఏం జరిగింది? ఇది తెలుసుకున్న భార్య ఎలాంటి అడుగులు ముందుకు వేసిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు మండలం మంథని గ్రామం చెందిన మైలారం సదానందం, కవిత భార్య భర్తలు. 2007 లో వివాహం జరిగిన వీరికి ముగ్గురు పిల్లల సంతానం. అయితే బతుకు దెరువు నిమిత్తం భర్త గల్ఫ్ దేశం వెళ్ళాడు. అలా వెళ్లిన భర్త సదానందం రెండు, మూడేళ్లకు ఒకసారి ఇండియాకు వచ్చి వెళ్ళేవాడు. కాగా భర్త లేకపోవడంతో భార్య కవిత వరసకు మరిది అయ్యే యువకుడితో శారీరక కోరికలు తీర్చుకుంటూ వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇక సమయం దొరికితే చాలు కవిత ప్రియుడితో ఎంచక్కా ఎంజాయ్ చేసేది. అయితే గత నెల 5న భర్త గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చిన కొన్ని రోజులకే భార్యా భర్తల మధ్య డబ్బు విషయంలో గొడవలు జరిగాయి.
ఈ నేపథ్యంలోనే భార్య చీకటి కాపురం భర్తకు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి మనస్పర్ధలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే జిల్లాలోని నవీ పెట్ మండలం నడపుర్ గ్రామానికి చెందిన ఓ మహిళతో భర్త సదానందానికి కూడా వివాహేతర సంబంధం ఉంది. ఇదే విషయం కొన్నాళ్లకి భార్య కవితకు తెలిసింది. ఇదే మంచి అవకాశం అని కవిత సంతోషపడింది. ఈ కారణంతో భర్తపై పగ తీర్చుకోవడానికి భార్య కంకణం కట్టుకుంది. మెల్ల మెల్లగా భర్త ప్రియురాలిని మచ్చిక చేసుకుంది. లేని పోనివి అన్నీ చెప్పి ఆ మహిళను కవిత తన వైపుకు తిప్పుకుంది. ఇందులో భాగంగానే తన భర్త హత్యకు స్కెచ్ వేసింది.
దీంతో ప్రియుడు సదానందంను నమ్మించి ఆ మహిళ ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అతనికి మద్యం తాగించింది. సదానందం పూర్తిగా మత్తులోకి జారుకున్నాక ఆ మహిళ ప్రియుడి భార్య కవితకు ఫోన్ చేసి వారు ఉన్న చోటకు రమ్మని చెప్పింది. దీంతో కవితతో పాటు ఆమె ప్రియుడిని వెంట పెట్టుకొని వచ్చింది. ప్రియుడితో కలిసి కవిత భర్తను గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నాడనే విధంగా నమ్మించే ప్రయత్నం చేయాలి అనుకున్నారు. దీంతో అతని నోట్లో పురుగుల మందు పోసి.. అక్కడి నుంచి అందరూ చెక్కేశారు.
ఇక సదానందం మరణంపై అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇక పోలీసుల విచారణలో సదానందం భార్యను అదుపులో తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. అనంతరం కవితతో పాటు సదానందం ప్రియురాలిని, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.