ప్రపంచంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. అమ్మ నవమాసాలు మోసి కని, పెంచి పోషిస్తుంది. పిల్లల సుఖమే తన సుఖం అని భావిస్తుంది. తన బిడ్డలు ప్రయోజకులు అయితే చూడాలని మురిసిపోతారు. దానికి కోసం అహర్నిశలు కష్టపడి, బిడ్డను పెద్ద చేస్తుంది. బిడ్డలు చెడు దారిలో వెళ్తున్న తల్లి వదులుకోలేదు. కానీ కొందరు బిడ్డలు మాత్రం పెంచి, పెద్ద చేసిన తల్లిని దారుణంగా హత్య చేసి, తల్లిబిడ్డల బంధానికి మాయని మచ్చను తెస్తున్నారు. తాజాగా ఓ కుమారుడు ఆస్తి తనపేరున రాయలేదని తల్లిని కత్తితో కిరాతకంగా పది సార్లు పొడిచి పొడిచి హతమార్చాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నరసరావుపేట లో అరండల్ పేటకు చెందిన శివమ్మ(60) కు ముగ్గురు కుమారులు. పెద్దకుమారుడు హత్యకు గురయ్యాడు. రెండో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 2020లో ఆమె భర్త అనారోగ్యంతో మరణించాడు. తండ్రి చనిపోయిన అనంతరం మరో కొడుకు వెంట్రావు ఆస్తి మొత్తం తన పేరున రాయాలని శివమ్మతో నిత్యం గొడవ పడుతుండే వాడు. వెంట్రావులు మద్యానికి బానిసై.. అప్పులు చేశాడు. వారికి ఉన్న మూడు ఇళ్ల స్థలాల్లో నుంచి రూ.15 లక్షలకు ఓ స్థలం అమ్మి వెంట్రావుకు ఇచ్చింది. ఈక్రమంలో శివమ్మ ఇంటికి ఆమె ఇద్దరు చెల్లెలు వచ్చి వెళ్తుండే వారు.
మిగిలిన ఆస్తి మొత్తం వారి పేరున రాస్తుందేమో అని అనుమానంతో తల్లితో మరింత ఎక్కువ గొడవ పడేవాడు.ఈ క్రమంలో వెంట్రావు భార్య, శివమ్మతో గొడవ పెట్టుకుంది. శనివారం మధ్యాహ్నం మరోసారి తల్లితో ఘర్షణకు దిగిన వెంట్రావు.. ఆమెపై 10 సార్లు కత్తితో పొడిచి పొడిచి చంపాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. శివమ్మ చెల్లెలు ఆదిలక్ష్మి, వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మరి.. ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.