“ప్రేమ” మనిషిని ఎంత దూరమైన తీసుకెళ్తుంది. కన్న పేగు బంధాలను సైతం తెచ్చుకునే ధైర్యం ఈ ప్రేమకి ఉంది. అలా ఓ జంట పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఊర్లో తిరుగుతుంటే కన్నవారిని బాధపెట్టిన వాళ్ల అవుతామని అనుకున్నారు. అంత మాములు స్థితికి వచ్చాక ఊరికి రావాలని భావించారు. ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం మైసూర్ జిల్లా హుణసూరుకు తాలూకా సింగరమారన హళ్లి గ్రామానికి చెందిన అర్చన(18), రాకేశ్(24)రేండేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించలేదు. దీంతో పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారు. వారి కళ్ల ముందు తిరుగుతూ బాధపెట్టడం ఎందుకని మైసూర్ కి వెళ్లి అక్కడ కాపురం పెట్టారు. మరో వైపు తమ పిల్లలు కనిపించడం లేదని ఇరువురి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ కొత్త జంట ఐదు నెలల తర్వాత వారి సొంతుర్లకు వెళ్లాలని భావించారు.
దీంతో అర్చన, రాకేశ్‌లు మైసూర్ నుంచి మంగళవారం రాత్రి సింగరమారనహళ్లి గ్రామానికి వచ్చారు. ఏం జరిగిందో ఏమో కానీ బుధవారం ఉదయానికి ఊరు శివార్లలోని పొలంలో చెట్టుకు వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న బిళికెరె ఎస్సై రవికుమార్ సిబ్బందితో సంఘనట స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మరి.. ఈఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.