నేటి సమాజంలో ఆడవారిపై అనేక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన కొందరిలో మార్పులు మాత్రం రావడం లేదు. ఇటీవలే శ్రద్ధావాకర్ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో అలాంటి ఘటన చోటుచేసుకుంది.
ఈ మధ్యకాలంలో ఆడవారిపై అఘాయిత్యాలు బాగా పెరిగి పోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన కూడా ఆడవారిపై జరిగే ఆకృత్యాలు మాత్రం ఆగడం లేదు. కొందరు మృగాలుగా మారి.. మహిళలను లైంగిక వేధించడం, దాడులకు పాల్పడటం చేస్తున్నారు. కొందరు తమను నమ్మి వస్తున్న యువతలను వాడుకుని వదిలేస్తున్నారు. అమ్మాయిలను వదిలించుకునే ప్రయత్నంలో భాగంగా అత్యంత దారుణంగా హత్య చేస్తున్నారు. ఇటీవలే జరిగిన శ్రద్ధా వాకార్ హత్యోదంతమే అందుకు నిదర్శనం. ఆ యువతి నమ్మి వచ్చినందుకు ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా ముక్కలు చేసి చంపాడు. ఈ ఘటన దేశమంతటా సంచలనంగా మారింది. ఆ ఘటన మరువక ముందే ముంబైలో మరో ఘటన చోటుచేసుకుంది. తనతో సహజీవనంలో ఉన్న 37 ఏళ్ల మహిళను ఓ వ్యక్తి దారుణంగా చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రలోని పాల్‌ఘడ్ జిల్లాకు చెందిన హర్ధిక్ షా అనే వ్యక్తి ఉద్యోగం నిమిత్తం ముంబైకి వచ్చాడు. ఈ క్రమంలోనే అక్కడ మేఘ(37) అనే మహిళతో గతకొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇద్దరు కలిసి ఉంటున్నారు. అతడికి ఉద్యోగం లేక ఇంటివద్దనే కాలక్షేపం చేసేవాడు. నర్శింగ్ చదివిన మేఘ.. స్థానికంగా ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబాన్ని నడిపించేది. ఇలా అతడు ఇంటి వద్ద ఉన్న కూడా సదరు మహిళనే ఉద్యోగం చేస్తూ అతడిని పోషించేంది. అలానే ఇంటిలో అయ్యే ప్రతి ఖర్చును మేఘానే భరించేది.
కొంతకాలం పాటు బాగానే సాగిన వీరి సహజీవనం ఆరు నెలల నుంచి దారి తప్పింది. ఇద్దరి మధ్య తరచు పెద్ద పెద్ద గొడవలు జరిగేవని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. ఇలా తరచూ ఇద్దరు ఒకరిపై మరొకరు భౌతిక దాడి కూడా చేసుకునే వారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవలే వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. మేఘాను ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శవాన్ని బెడ్ కింద ఉండే బాక్స్ లో పెట్టి.. ఇంట్లోని విలువైన వస్తువులు తీసుకుని పారిపోయాడు. దొంగిలించిన విలువైన వస్తువులను స్థానిక మార్కెట్లో అమ్మేసి సొంత ఊరైన పాల్‌ఘడ్ కు పారిపోయే ప్రయత్నం చేశాడు.
అయితే ఇంటి నుంచి ఎటువంటి అలకిడి లేకపోవడం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన హార్ధిక్ ను సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా మధ్యప్రదేశ్ లోన నాగ్దాలో అరెస్టు చేశారు. మహిళ మృతితో ఆమె కుటుంబం విషాదంలో మునిగింది. అయితే ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సింది. మరి.. ప్రేమ, సహజీవనం పేరుతో ఇలా నిత్యం మోసపోతున్నా, హత్యగావింప బడుతున్న మహిళ ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.