భార్య ప్రవర్తనపై అనుమానం, ఆమె తీరుపై మనస్తాపం చెందిన ఓ భర్త దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తాను ఎంత చెప్పిన భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నేటికాలంలో వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. భాగస్వామిని కాదని పరాయి వారితో పడక సుఖం కోసం కొందరు వెంపర్లాడుతున్నారు. పది నిమిషాల పరాయి వారితో పడక సుఖం కోసం పచ్చని సంసారాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. కొందరు భార్యలు చేసే ప్రవర్తనతో భర్తలు మానసికంగా కుంగిపోతున్నారు. బయటకు చెప్పుకోలేక.. వారిలో వారే కుమిలిపోతున్నారు. తాజాగా భార్య ప్రవర్తనపై అనుమానంతో, ఆమె తీరుపై మనస్తాపం చెందిన ఓ భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
అన్నమయ్య జిల్లా ములక చెరువు మండల కేంద్రంలోని ఉమాశంకర్ కాలనీకి చెందిన అక్బర్ బాషా(36) వివాహం జరిగింది. ఆయనకు ఓ కుమాడు, కుమార్తె ఉన్నారు. భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు స్థానికంగా ఓ బేకరిలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అక్బర్ బాషా ఇంటికి సమీపంలో వినోద్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడికి, అక్బర్ భార్యకు పరిచయం ఏర్పడింది. దీంతో వినోద్ తరచూ అక్బర్ భార్యతో సన్నిహితంగా మెలుగుతుండేవాడు. అది చూసిన అక్బర్ భాషా.. తనతో అలా సన్నిహితంగా ఉండటం మంచి పద్ధతి కాదని భార్యను మందలించాడు. అయితే అక్బర్.. తన భార్యను మందలించిన విషయం వినోద్ కు తెలిసింది. దీంతో వినోద్ కుమార్ అక్బర్ తో గొడవ పడ్డాడు.
అంతేకాక నీ భార్యతోనే మాట్లాడుతూ ఉంటానంటూ అందరిలో చెప్పడంతో స్థానికులు మందలించి అక్కడి నుంచి పంపేశారు. అయితే ఈ అవమానాన్ని తట్టుకోలేక మనస్తాపంతో అక్బర్‌బాషా.. తన చావుకు వినోద్‌కుమారే కారణం అంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.బాషా కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టు పక్కల వారిని విచారించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి.. ఎవరో చేసిన తప్పుకు ఇలా ఎందరో అమాయకులు బలవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి… ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.