రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మానసిక రోగి అని విమర్శించిన మోడల్ హత్యకు గురయ్యారు. ఏడాది క్రితం మిస్సింగ్ అయిన ఆమె ఇప్పుడు విగతజీవిగా కనిపించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. రష్యన్ మోడల్ గ్రేటా వెడ్లర్ మృతదేహాన్ని ఓ సూట్ కేసులో కనుగొన్నారు.
గ్రెట్టా వెడ్లెర్.. 23 ఏళ్ల రష్యన్ మోడల్ దారుణ హత్య ప్రస్తుతం రష్యాలో కలకలం సృష్టిస్తోంది. గ్రెట్టా వెడ్లెర్.. మోడల్ కాదు మంచి స్ఫోకర్ కూడా. తన మాటలతో అందరని ప్రభావితం చేయగల సామర్థ్యం కల వ్యక్తి గ్రెట్టా. అయితే గతంలో పుతిన్‌ను సైకోపాత్ అంటూ తిట్టిపోసింది. రష్యా అధ్యక్షుడిని తిడుతూ 2021 జనవరిలో సోషల్ మీడియాలో ఓ వివాదాస్పద పోస్ట్ చేసింది. “బాల్యంలో పుతిన్ చాలా అవమానాలను చవిచూశాడు. అందుకు అతని ఫిజిక్కే కారణం. ఆ కారణంతోనే తన కోసం తాను నిలబడలేకపోయాడని తెలిపింది.అంతేకాదు.. న్యాయ విద్యను విడిచిపెట్టి KGBలో చేరడానికి అదే కారణమైనా ఆశ్చర్యపోనక్కర్లేదంది. అందుకే తన దృష్టిలో అతనొక మానసిక రోగి” అంటూ కామెంట్లు చేసిందామె.
ఆ తర్వాత కొన్నివారాలకు ఆమె కనిపించకుండా పోయింది. అయితే తాజాగా ఆమె హత్యకు గురైందంటూ రష్యా దర్యాప్తు కమిటీ ఒకటి ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఓ ఫామ్‌హౌస్ లో పార్క్ చేసి ఉన్న కారులో సూట్‌కేసులో కుక్కేసి ఉన్న ఆమె మృతదేహం బయటపడింది. అధికారు విడుదల చేసిన వీడియోలో వెడ్లెర్ ప్రియుడు దిమిత్రి కోరోవిన్.. తానే ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు ఉంది. పుతిన్‌ను తిట్టిన వ్యవహారానికి.. ఆమె హత్యకు ఎలాంటి సంబంధంలేదని.. కేవలం డబ్బు కోసం జరిగిన వాగ్వాదంలో ఆమెను చంపేసినట్లు కోరోవిన్ అంగీకరించాడు. మరి..ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.