భార్యాభర్తల బంధంలో చిన్న చిన్న కలహాలు అనేది సర్వసాధారణం. అయితే వాటిని పెద్దవిగా చేసుకున్నప్పడు మాత్రం ఘోరాలు జరుగుతుంటాయి. నేటి కాలంలో కొందరు దంపతులు ప్రతి చిన్న విషయానికి ఘర్షణ పడుతున్నారు. దీని కారణంగా.. వారిలో ఎవరో ఒకరు మనస్తాపం చెంది.. దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కొందరు ఆడవాళ్లు ఆరోగ్యం బాగాలేకున్నా, భర్తతో వాగ్వాదం జరిగిన మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఆరోగ్య సమస్య, భర్తతో గొడవ కారణంగా ఓ మహిళ..ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణం తట్టుకోలేక భర్త కూడా ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. వీరిద్దరి అనాలోచితన నిర్ణయం కారణంగా వారి కొడుకు ఒంటరయ్యాడు. ఇక పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మిర్యాలగూడ లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన గుంటి రామకృష్ణ, యామిని భార్యాభర్తలు. వీరికి 11 ఏళ్ల క్రితం వివాహం జరగ్గా.. 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. వీళ్లు పట్టణంలోని రాజీవ్ చౌక్ సమీపంలో మీసేవా కేంద్రాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడ్ని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఆ దంపతులు హాయిగా గడుపుతున్నారు. అయితే యామిని కొద్దిగా అనారోగ్య సమస్యతో బాధపడుతుందని సమాచారం. అలానే అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుండేది. అలానే శుక్రవారం సాయంత్ర కూడా యామిని, రామకృష్ణ మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది.
ఈక్రమంలో కోపంతో తన ఫోన్ ను ఇంట్లోనే వదిలేసి రామకృష్ణ బయటకి వెళ్లాడు. అనంతరం కొద్ది సమయం తరువాత యామిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్ది సేపటి అదే బిల్డింగ్ లో కింద పోర్షన్ లో ఉన్న యామిని అత్తామామలు పైకి వెళ్లి చూశారు. అప్పటికే యామిని చున్నీతో ఉరేసుకుని ఉండటం అత్తామామలు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని కిందకు దించి.. పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన రామకృష్ణ అదృశ్యమయ్యాడు. అయితే భార్య చనిపోయిందనే మనస్తాపంతో నందిపాడు సమీపంలోని సాగర్ కాల్వలో రామకృష్ణ దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాల్వ గడ్డుపై రామకృష్ణ బైక్ ఉండటంతో వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అయితే భార్యాభర్తలు ఇద్దరు చాలా మంచి వారని, అలానే వాళ్లు చాలా సున్నితమైన మనస్సు కలవారని స్థానికులు అంటున్నారు. అలానే యామిని కూడా అనారోగ్య సమస్యతో బాధపడుతుందని కూడా స్థానికులు తెలిపారు. ఏది ఏమైనప్పటికి వీరిద్దరు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా వారి కుమారుడు ఒంటరి వాడయ్యాడని బంధువులు పేర్కొన్నారు. మరి.. ఆవేశంలో ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.