తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మహిళను వేధిస్తున్నాడనే కారణంతో ఓ యువకుడిని ఆ మహిళ కుటుంబ హత్య చేసింది. ఈ ఘటనతో స్థానికంగా భయానక వాతావరణం ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మహిళను వేధిస్తున్నాడనే కారణంతో ఓ యువకుడిని ఆ మహిళ కుటుంబ హత్య చేశారు. అందరూ చూస్తుండగానే యువకుడి తలపై రాయితో కొట్టి చంపేశారు. నడి రోడ్డుపై జరిగిన ఈ ఘటనను అందరూ చూస్తూనే ఉన్నారు కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ హత్యలో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మంచిర్యాల జిల్లా జైపుర్ మండలం ఇందారంలో మహేష్ అనే వ్యక్తి.. వివాహితను ప్రేమతో వేధిస్తూ, అసభ్య మెసేజ్ లు పంపడంతో పోలీస్ స్టేషన్లలో మహిళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా మహేష్ వేధింపులు ఆగలేదు. దీంతో ఆగ్రహంతో మహేష్ ను ఆ యువతి కుటుంబ సభ్యులు రాయితో కొట్టి చంపేశారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే యువకుడి తలను ఓ వ్యక్తి రాయితో ఛిద్రం చేశాడు. తన తల్లి, సోదరుడు, మరో వ్యక్తితో కలిసి వేధిస్తున్న యువకుడిని మహిళ దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కాసేపుటి తరువాత మృతుడి కుటుంబ సభ్యులు అక్కడి రావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. హత్య చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇలా ప్రేమ, వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మంచిర్యాల్లో పట్టపగలే ఈ ఘోరం జరిగింది. మరి.. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.