ఈ మధ్యకాలంలో చాలా మందికి తమ భాగస్వామిని వదిలేసి మరొకరితో సహజీవనం చేస్తున్నారు. అంతేకాక ఇలా రెండు వైపు భాగస్వామిని వదిలేసిన వాళ్లు కూడా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఇలాంటి జంటల్లో కొందరు దారుణాలు చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో చాలా మందికి తమ భాగస్వామిని వదిలేసి మరొకరితో సహజీవనం చేస్తున్నారు. అంతేకాక ఇలా రెండు వైపు భాగస్వామిని వదిలేసిన వాళ్లు కూడా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఇందులోనూ ఎలాంటి తప్పు లేదు… కానీ మొదటి భాగస్వామితో వచ్చిన గొడవల కారణంగా విడిపోయిన వీళ్లు.. కొత్త వారితో కూడా ఘర్షణ పడుతున్నారు. ఇలా జరిగే ఘర్షణల కారణంగా ఇద్దరి ఎవరో ఒకరు బలవుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రాంతానికి చెందిన కోటేశ్వరావుకు.. తన తొలి భార్యతో విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చాడు. ఆయనకు ఓ కుమార్తె ఉంది. అలానే బందరు మండలానికి చెందిన వివాహిత వెంకటేశ్వరమ్మ(38) అనే మహిళ కూడా భర్తతో విభేదాలు రావడంతో అతనితో తెగతెంపులు చేసుకుంది. ఈమెకు ఒక కుమార్తె ఉంది. ఇలా తమ భాగస్వామితో విడిపోయిన వీరిద్దరు ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. పిల్లలని వారి బంధువుల వద్ద వదిలేసి వీరిద్దరు నివాసం ఉంటున్నారు.
కొన్నేళ్ల పాటు వీరిద్దరు ఎంతో సంతోషంగా గడిపారు. అయితే ఇటీవలో కొంతకాలం నుంచి వారి సంతానం విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన మొదటి భార్య కుమార్తెను ఇంటికి తీసుకువస్తాని కోటేశ్వరావు చెప్పడంతో వెంకటేశ్వరమ్మకు ఆగ్రహం వచ్చింది. అలా అయితే తన మొదటి భర్తతో కలిగిన కూతురిని ఇంటికి తీసుకువస్తానంటూ పట్టుబట్టింది. ఇందుకు కోటేశ్వరరావు ససేమిరా అన్నడంతో పాటు భార్యపై కోపం పెంచుకున్నాడు.
అంతేకాక ఆమె అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. సోమవారం ఉదయం ఇంట్లో పనులు చేసుకుంటున్న వెంకటేశ్వరమ్మ తలపై కత్తితో నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె చనిపోయినట్లు నిర్ధారించుకున్న తరువాత ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అలానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.