నిత్యం ఏదో ఒక్కచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల కారణంగా అమాయకులు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వంటి కారణాలతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఘోరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారి స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి ప్రాంతంలోని పంగి ఖుర్ద గ్రామ సమీపంలోని పిలిభిత్ బస్తీ రహదారిపై ఓ కారు ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న వ్యక్తి గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలంకి చేరుకుని గుమిగూడారు. గాయపడిన వ్యక్తి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో బహ్రెయిచ్ నుంచి వేగంగా వస్తున్న ఓ లారీ ఆ జనాలపైకి దూసుకెళ్లింది. అనంతరం సమీపంలో ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈప్రమాదంపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిచాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మద్యం మత్తులో ఉండటం వలనే ఈ ప్రమాదం చోటుచేసుకుందిని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలా కొందరి నిర్లక్ష్యానికి ఎందరో బలైపోతున్నారు. మరి.. ఈ ఘోరమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.