నేటికాలంలో యువత ప్రతి చిన్న విషయానికి ఆవేశపడిపోతున్నారు. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు తాను ఎంతగానో అభిమానించే హీరో సినిమా ఇటీవల విడుదలైంది. అయితే ఆ సినిమా బాగాలేదని మనస్తాపం చెందినఆ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు టౌన్ లోని తిలక్ నగర్ కు చెందిన ముత్యాల రవితేజ(24) వృతిరీత్యా వెల్డింగ్ పనిచేసున్నాడు. అతని తల్లిదండ్రులు రోజు వారికూలికి వెళ్తు జీవనంసాగిస్తున్నారు. రవితేజ ఓ పాన్ ఇండియా స్టార్ కు వీరాభిమాని. ఆ హీరోది ఏ సినిమా వచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాడు. ఈక్రమంలో ఆ స్టార్ హీరో ది ఓ పాన్ ఇండియా సినిమా ఇటీవల విడుదలైంది. రవితేజ తన అభిమాన హీరో సినిమాను విడుదలైన రోజే చూశాడు. అయితే మిత్రులతో ఆ సినిమా ఫ్లాప్ అయిందిన చెప్పి బాధపడ్డాడు. ఇంటికి వెళ్లిన తరువాత కూడా తన అభిమాన హీరో సినిమా బాగాలేదని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఎవరూలేని సమయంలో ఇంట్లోనే రవితేజ ఉరేస్తుకున్నాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇంటి తలుపు బద్దల కొట్టి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు.చేతికి అంది వచ్చిన కొడుకు విగత జీవిగా మారడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.