సాధారణంగా సోదరుడి పిల్లలు అంటే సోదరికి ఏనలేని ప్రేమ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తన బిడ్డల కన్న తన సోదరుడి పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటారు ఆడపిల్లలు. మేనత్త అని పిలిపించుకుంటూ సంతోషంతో పొంగిపోతుంటారు. మేనత్త అంటే తల్లి తర్వాత తల్లి అని పెద్దలు అంటారు. కానీ ఓ అత్త మాత్రం తన మేనల్లుడి పాలిట యమదూత అయింది. అభం శుభం తెలియని మేనల్లుడిని చిత్ర హింసలకు గురిచేసి.. శరీరంపై వాతులనుపెట్టి చివరకు చంపేసింది. ఈ దారుణానికి ఆమె భర్త కూడా వత్తాసు పలికాడు ఈ దారుణమైన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కోనంపేట గ్రామానికి చెందిన శివ, భాగ్యమ్మ అనే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు పేరు అయాన్(10). శివ దంపతులు జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు. వీరి పిల్లలు నాన్నమ, తాతయ్యల వద్ద ఉంటున్నారు. శివకు ఇంద్రజ అనే సోదరి ఉంది. ఆమె ముడేళ్ల క్రితం అంజన్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంజన్‌కుమార్ ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే వీరి వివాహం శివకు ఇష్టం లేదు. అందుకే సోదరితో మాట్లడటం మానేశాడు. ఈ క్రమంలోనే ఇంద్రజకు ఓ పాప పుట్టింది. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య కొంత మాటలు కలిశాయి.
ఇటీవల 10 రోజుల క్రితం బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకలకు కోసం ఇంద్రజ, అంజన్ కుమార్ కోనంపేట వెళ్లారు. అక్కడ మేనల్లు అయాన్ చూసి ఇంద్రజ.. తన వెంట కడపకు తీసుకెళ్లి బాగా చదివిస్తామని నాన్నమతో చెప్తుతుంది. దీని అయాన్ వాళ్ల నాన్నమ అంగీకరిస్తోంది. అయితే తన బిడ్డను సోదరి ఇంటికి పంపండం శివకు ఇష్టం లేదు. అయినా ఇంద్రజ బాలుడిని కడపకు వెళ్లింది. అయన్ ను తమ బిడ్డలాగా చూసుకుంటామని చెప్పిన వీరు..బాగా అల్లరి చేస్తున్నాడనే నెపంతో చిత్రహింసలు పెట్టేవారు. శివపై ఉన్న ద్వేషంతో ఇంద్రజ భర్త కూడ తరచూ అయాన్ ని కోట్టేవాడు. బాలుడి శరీరంపై చాలా చోట్ల గాయాలున్నాయి. తొడపై కాల్చిన గాయముంది.
ఈక్రమంలో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు గుర్తించి రిమ్స్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో అయాన్ ని అక్కడే వదిలేసి ఇంద్రజ దంపతులు వారి కుమార్తెతో కలిసి పరారయ్యారు. రిమ్స్ మార్చురీలోని బాలుడి మృతదేహాన్ని కడప డీఎస్పీ శివారెడ్డి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. ఇంద్రజ దంపతులపై మృతుడి నాన్నమ్మ, తాతయ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంద్రజ తన అన్న శివకు ఓ వాయిస్ మెసేజ్ పంపింది.
అందులో తాము చేయరాని తప్పు చేశామని, అయాన్ చనిపోయాడని తెలిపింది. తరువాత సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి భర్త, కుమార్తెతో కలిసి పరారైంది. సమాచారం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు కువైట్ నుంచి వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.