సమాజంలో ఏ ఇద్దరి జీవితం ఒకేలా ఉండదు. కొందరి జీవితాలు పూలపాన్పులపై నిద్ర, గోల్డెన్ స్పూన్ లతో సాగుతోంది. మరికొందరి జీవితం రాళ్లపై నిద్ర, అర్ధాకాలితో సాగుతోంది. ఇంకొందరి జీవితం పై రెండు తరగతుల వారికి మధ్యన ఉంటుంది. తమ కొర్కేలను, ఆశలను అణచుకుంటూ ఉన్నంతలో జీవిస్తారు. ఇలాంటి వారి జీవితంలో అనుకోని ఆపదలు వచ్చి పడితే.. జీవితమే అస్తవ్యస్తం అవుతోంది. అలాంటి ఘటనే ఓ కుటుంబంలో చోటుచేసుకుంది. అంతా సవ్యంగా సాగిపోతూ, ఉన్నదాంట్లోనే సర్ధుకుపోతున్నా ఆ కుటుంబాన్ని ఊహించని రీతిలో గుండె సంబంధిత వ్యాధి వారిని కష్టాల్లోకి నెట్టింది. చివరకు చికిత్సకు డబ్బులు లేక భర్త మృతి చెందగా.. ఆ వేదనను తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం మోరంచపల్లిలో చుక్క సారయ్య(55), కవిత(50) అనే దంపతులు నివాసం ఉన్నారు. సారయ్య కల్లు గీతకార్మికుడు. కులవృతి చేస్తూ కుటుంబాన్ని పోషించే వాడు. ఆయనకు మొదటి భార్య సమ్మక్క కొన్నేళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో కవితను పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరికి సంతానం లేరు. మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉండగా.. వారి ముగ్గురికి పెళ్లిళ్లు చేయడంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. అలానే పెద్ద కుమారుడు కొన్ని ఏళ్ల క్రితం మరణించాడు. అందరిని ఓ ఇంటి వాడిని చేసిన సారయ్య.. కవితతో కలిసి జీవిస్తున్నాడు. కులవృతి చేసుకుంటూ జీవనం ఆ దంపతులిద్దరు హాయిగా జీవిస్తున్నారు.
అంతా సవ్యంగా సాగిపోతూ, ఉన్నదాంట్లో సర్ధుకుపోతున్న ఆ కుటుంబంలో ఓ సమస్య వచ్చింది. కొన్నాళ్ల క్రితం సారయ్య కు గుండె సంబంధిత వ్యాధి వచ్చింది. దీంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటి నుంచే మందులు వాడుతున్నాడు. ఇదే సమయంలో ఆరోగ్యం సహకరించక సారయ్య గీతకార్మిక వృతిని వదలేశాడు. దీంతో ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఇక కుటుంబ పోషణ కోసం ఉన్న భూమిని అమ్మేందుకు కూడ ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో తన సమస్యల గురించి పిల్లలకి తెలియకుండా తనలో తానే మధనపడుతుండే వాడని గ్రామస్థులు తెలిపారు. ఈక్రమంలో బుధవారం సారయ్య ఇంటి నుంచి ఎలాంటి అలికిడి వినిపించలేదు.
దీంతో స్థానికులు కిటికిలోంచి చూడటంతో దంపతులు విగతజీవులుగా కనిపించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. అర్దరాత్రి సమయంలో గుండె పోటు రావడంతో సారయ్య మృతి చెంది ఉంటాడని, అతడి మృతిని తట్టుకోలేక కవిత ఆత్మహత్య చేసుకుని ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆ ఇంట్లో కేవలం వారిద్దరే ఉండటంతో, వారే మరణించడంతో అసలు ఏమి జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టంకి పంపించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.