ఓ మహిళ ఘాతుకానికి పాల్పడింది. తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత భర్త మృతదేహంతో ఐదు రోజులపాటు ఇంట్లోనే జీవించింది. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు అనుమానిచడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మనిషికి అన్నిటి కంటే ముఖ్యమైనది ఆరోగ్యం. అది సరిగ్గా ఉంటే చాలు ప్రశాంతంగా బతక వచ్చు. అదే ఆరోగ్యం సరిగ్గా లేకుంటే ఎంత ఆస్తి ఉన్న ఉపయోగం ఉండదు. ముఖ్యంగా ఇంట్లో ఒక్కరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కూడా మిగిలిన వారు కూడా బాధపడుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే మానసిక స్థితి బాగాలేని వ్యక్తి చేసే పనులు అతడి కుటుంబ సభ్యులు ఎంతో ఓపికగా భరిస్తుంటారు. వారు ఎంత దారుణంగా ప్రవర్తించిన సర్ధుకుపోతుంటారు. అదే వారిపాలిట ఒక్కొక్కసారి మృత్యువుగా మారుతుంది. తాజాగా ఓ భార్య.. తన భర్తను చంపి.. ఐదు రోజుల పాటు మృతదేహంతో వద్దనే కూర్చొంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణమైన ఘటన ఝార్ఖండ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఝార్ఖండ్ రాష్ట్రం జంషేడ్ పూర్ పట్టణంలో సుభాష్ కాలనీలో అమర్నాథ్ సింగ్, మీరా అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లన కొంతకాలం వరకు ఈ దంపతులు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలసి జీవించారు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. అతడు పూణెలు ఉంటున్నాడు. అయితే కొంతకాలం నుంచి మీరా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతుండేవారు. ఈ కారణంతోనే ఆ దంపతుల మధ్య తరచుగా వాగ్వాదం జరుగుతుండేది.
అలానే తరచూ గొడవలు పడిన సందర్భంలో మీరా కోపంతో ఇంట్లోని వస్తువునుల బయట విసిరేస్తూ రచ్చ రచ్చ చేసేది. చుట్టు పక్కల వాళ్లు చూసి… చెప్పిన వారిపైనా గొడవకు దిగేది. ఇక ఆ దంపతుల గొడవలు చూసి స్థానికులకు కూడా అలవాటైపోయింది. ఈక్రమంలోనే ఇటీవల ఐదు రోజుల నుంచి అమర్నాథ్ సింగ్ కనిపించడం లేదు. ఇంట్లో నుంచి కూడా ఎవరు బయకు రావడం లేదు. అయితే దంపతులు ఇద్దరు ఊరికి వెళ్లి ఉంటారని అందరు భావించారు. అయితే ఇటీవల ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇంటికి వెళ్లి తలుపు కొట్టగా.. మీరా తలుపు తెరచి.. వారిని తిడుతూ అక్కడి నుంచి వెళ్లగొట్టింది. అంతేకాక తన ఇంటిలోకి ఎవరు రాకుండా ఉండాలని చుట్టూ ఉన్న కంచెకు కరెంటు పెట్టింది.
దీంతో స్థానికులు ఎవరూ ఇంట్లోకి వెళ్లే సాహసం చేయలేదు. చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడి చేరుకున్నారు. అమర్నాథ్ ను చంపిన తరువాత మీరా ఇంటికి తాళం వేసిందని వారు తెలిపారు. పోలీసులు అమర్నాథ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అలానే నిందితురాలని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి.. ఇలాంటి ఘటనల్లో మానసిక స్థితి సరిగా లేని భార్యది తప్పా.. ఆమె ఆస్థితిలో ఉన్నా జాగ్రత్తగా లేని అతడి తప్పా? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.