రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఆదర్శ దాంపత్య జీవితాన్ని నిదర్శనం ఈ శ్రీరామ నవమి పర్వదినం. ఇలాంటి వేడుక రోజున ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. భార్యపై అనుమానంతో భర్త అర్ధరాత్రి దారుణానికి ఒడిగట్టాడు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఆదర్శ దాంపత్య జీవితాన్ని నిదర్శనం ఈ శ్రీరామ నవమి పర్వదినం. ఇలాంటి వేడుక రోజున ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. నిత్యం కలహాలతోనే కాపురాన్ని నెట్టుకొస్తున్న ఆ ఇల్లాలు చివరకి భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో వారి పిల్లలు తల్లిలేని వారిగా మారిపోయారు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన బొల్లం జగదీశ్, రాజేశ్వరి(28) భార్యాభర్తలు. ఈ దంపతులకు మూడేళ్లు, ఐదేళ్ల వయస్సున ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెల్గటూరు మండలం ముత్తునూరుకు చెందిన కండ్లె దేవయ్య, ఎల్లమ్మ దంపతుల కుమార్తె రాజేశ్వరిని, బొల్లం జగదీశ్ కు ఇచ్చి 2016లో వివాహం చేశారు. పెళ్లైన తొలినాళ్లలో వీరి సంసారం చాలా సజావుగానే సాగింది. ఆ తరువాత వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే కొంత కాలంగా జగదీశ్ పనీపాటా లేకుండా తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీనికి తోడు మద్యానికి బానిసగా మారి భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నాడు.
తన భార్య అందంగా ఉందని నిత్యం అనుమానిస్తూ వేధింపులకు గురి చేసేవాడు. ఇదే విషయాన్ని రాజేశ్వరి తన పుట్టింటివారితో చెప్పుకుంది. వారు పలుమార్లు నచ్చచెప్పినా జగదీశ్ బుద్ధిలో మార్పు రాలేదు. ఇలా నిత్యం తాగి వచ్చిభార్యతో గొడవ పెట్టుకునే వాడు. కొన్ని సందర్భాల్లో ఆమెపై భౌతిక దాడి కూడా చేసేవాడని స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య ఏదో విషయమై ప్రారంభమైంది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన జగదీశ్ పదునైన ఆయుధంతో రాజేశ్వరి దవడ, మెడ, వీపుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆమె కుడి చేతి చూపుడు వేలిని కోసివేశాడు. అంతేకాక కత్తిపీటతో రాజేశ్వరి గొంతును కోసేశాడు.
తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడే మృతి చెందింది. పిల్లలు ఉదయం నిద్రలేచిన తరువాత రక్తపు మడుగులో తల్లి పడి ఉండటాన్ని గమనించారు. అదే విషయాన్ని సమీపంలో నివాసం ఉంటున్న తాత, నానమ్మలకు చెప్పారు. అంతేకాక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు నిందితుడు జగదీశ్ తో పాటు అతని తల్లిదండ్రులు, సోదరుడు హిమాలయ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలానే విచారణ జరుపుతున్నట్లు ఎస్సై నరేష్‌కుమార్ తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.