దేశ రాజధాని ఢిల్లీ నగరంలో శ్రద్ధా వాకర్ అనే యువతి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నిందితుడు ఆ యువతిని 35 ముక్కలు గా చేసి.. ఫ్రిజ్ లో పెట్టి.. 18 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్ లో అలాంటి ఘటన తాజాగా వెలుగుచూసింది. తాను ప్రేమించిన అమ్మాయి.. మరొక వ్యక్తితో రొమాన్స్ చేస్తుందనే అనుమానంతో.. ఆమెని నమ్మించి ఓ హోటల్ కి తీసుకెళ్లి.. ఆమెను గొంతు కోసి దారుణంగా చంపేశాడు. అంతేకాక మృతదేహన్ని పక్కన పెట్టుకుని సెల్ఫీ వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టాడు. నిజయితీగా లేకుండా తనను మోసం చేసినందుకు ఈ శిక్ష వేసినట్లు నిందితుడు వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…
గుజరాత్ కు చెందిన అభిజిత్ పాటిదార్ ఓ వ్యాపారస్తుడు. అతనికి బీహార్ కు చెందిన జితేంద్ర కుమార్ బిజినెస్ పార్టనర్. ఇక అభిజిత్ పాటిదార్ కు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా కుందాం ప్రాంతానికి చెందిన శిల్పా ఝరియా(25) అనే యువతితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత కొన్ని రోజులకు డైరెక్ట్ గా కలుసుకున్నారు. ఈక్రమంలో వారిద్దరు ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. అభిజిత్ ఆమెను విహార యాత్రలకు తీసుకెళ్లి తెగ ఎంజాయ్ చేయించే వాడు. కొంతకాలానికి శిల్పా.. అభిజిత్ స్నేహితుడైన జితేంద్రతో కూడా పరిచయం పెంచుకుంది. ఒక వైపు అభిజిత్ తో డేటింగ్ చేస్తూనే.. మరొకవైపు అతడి స్నేహితుడితో టూర్ లకి వెళ్లేది. అభిజిత్ ఇచ్చిన డబ్బులను జితేంద్రకి ఖర్చు చేసేది. ఇలా కొంతకాలం పాటు ఇద్దరితోనూ శిల్పా గడిపేది. ఈ విషయం అభిజిత్ తెలిసి.. నమ్మించి మోసం చేశావంటూ కసితో రగిలిపోయాడు.
అదును చూసి శిల్పాను చంపేయాలని భావించాడు. ఈక్రమంలో శిల్పా ఉండే జబల్ పూర్ కి వెళ్లి.. అక్కడ మేఖ్లా అనే రిసార్ట్ లో రూమ్ తీసుకున్నాడు. అక్కడికి రమ్మని శిల్పాకు ఫోన్ చేశాడు. అభిజిత్ పిలవడంతో శిల్పా ఆ రిసార్ట్ కి వెళ్లింది. అయితే అభిజిత్ ప్లాన్ ప్రకారం.. శిల్పా గదిలోకి రాగానే గొడవపెట్టుకున్నాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న కత్తితో శిల్పా మెడ, మణికట్టుపై కోసి చంపేశాడు. అంతటితో ఆగక.. మృతదేహాన్ని చూపిస్తూ వీడియో తీశాడు. “నన్ను మోసం చేసింది. అందుకే నేను ఈమెను చంపేసి మంచి పనిచేశాను. నిజాయితి లేనందుకే ఈ శిక్షవేశాను” అంటూ వీడియోలో తెలిపారు. ఈ వీడియో తీసే సమయంలో ఆమె ముఖాన్ని కూడా చూపించాడు. ఆ సమయంలో శిల్పా కొన ఊపిరితో ఉంది. వీడియోను అభిజిత్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. దీంతోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
నవంబరు 8న ఈ ఘటన జరగ్గా..తాజాగా బయటపడింది. రిసార్ట్ కి వెళ్లిన పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన అభిజిత్ కోసం పోలీసుల గాలిస్తున్నారు. నిందితుడైన అభిజిత్ పై లు చీటింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చాలా మందికి లక్షల్లో మోసం చేశాడని తెలిపారు. ప్రస్తుతం సైబర్ పోలీస్ బృందం కూడా రంగం దిగి.. అభిజిత్ సోషల్ అకౌంట్ లను పరిశీలిస్తున్నారు. అతడు శిల్పా ఇన్ స్టాగ్రామ్ ను ఉపయోగిస్తున్నట్లు తేలింది. స్థానికంగా అందిన సమాచారం ప్రకారం.. శిల్పాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకి వచ్చాయి. శిల్పా.. అభిజిత్ తోనే కాకుండా జితేంద్ర కుమార్, సుమిత్ పటేల్ , మరో ఇద్దరి వ్యక్తులతో ప్రేమ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు శిల్పాతో పరిచయం ఉన్న వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. శిల్పా..ముగ్గురు యువకులతో చనువుగా ఉంటుందనేది నిందితుడు అభిజిత్ అనుమానం మాత్రమే. అందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంలో నిజా నిజాలు పక్కన పెడితే.. ఓ మనిషిని, అందులోనూ ఆడపిల్లను నమ్మించి దారుణంగా హత్య చేయడం నేరం. సభ్య సమాజం అతడి చర్యను అంగీకరించదు. ఇలాంటి వ్యక్తులకు కఠినమైన శిక్షపడితేనే.. ఆ యువతి కుటుంబానికి న్యాయం జరిగినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.