ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ లోన్ పేరిట జరుగుతున్న ఆకృత్యాలకు అనేక మంది బలవుతున్నారు. ఇటీవల కాలంలోనే ఓ విద్యార్ధి, ఓ యువతి .. ఈ లోన్ యాప్ ఆగడాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఈ ఆన్ లైన్ లోన్ యాప్స్ వేధింపులకు ఓ ప్రభుత్వ ఉద్యోగి బలయ్యాడు. ఆన్ లైన్ లోన్ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక మనస్థాపం చెందిన ఆ ప్రభుత్వ ఉద్యోగి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
రంగారెడ్డి జిల్లా జల్ పల్లికి చెందిన యంజల్ సుధాకర్(33) బహదూపూర్ లోని ఫైర్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య, రెండున్నర ఏళ్ల కూతురు ఉంది. అయితే ఇటీవల కుటుంబ అవసరాల నిమిత్తం ఓ లోన్ యాప్ ద్వారా రూ.6000 తీసుకున్నాడు. అనంతరం సకాలం తిరిగి కట్టాలేకపోయాడు. ఈక్రమంలో లోన్ యాప్స్ ఏంజెంట్లు సుధాకర్ ను వేధింపులకు గురిచేశారు. లోన్ కట్టకుంటే అతని భార్య అశ్లీల ఫోటోలను సోషల్ మీడియాలో, వాట్సప్ లో పెడతామంటూ బెదిరింపులకు గురిచేశారు. అంతటి ఆగక సుధాకర్ బంధువులకు, స్నేహితులకు కూడా అసభ్యకరమైన మెసేజ్ లు లోన్ యాప్ ఏజెంట్లు పంపారు. వారి వేధింపులు తట్టుకోలేక సుధాకర్.. తన సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఈక్రమంలోనే మానసికంగా వేదనకు గురైన సుధాకర్.. మంగళవారం ఉదయం శివరాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు కాచిగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుధారక్ ఆత్మహత్యకు పాల్పడడంతో తోటి అగ్నిమాపక సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.