నేటికాలంలో కొందరు పరాయి వారితో అక్రమ సంబంధాల పెట్టుకుని కాపురాలను నిట్ట నిలువును కూల్చుకుంటున్నారు. క్షణిక సుఖం కోసం భార్య, బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు. కొందరు భర్తలు అయితే ఏకంగా భార్య పిల్లలను పట్టించుకోకుండా వేరే మహిళలతో పడక సుఖం కోసం పాకులాడుతుంటారు. మారుతాడులే అని భర్త ఆకృత్యాలను భరిస్తూ వస్తుంటారు భార్యలు. అయితే కొందరిలో సహనం నశించి.. భర్తకు బుద్ది చెప్పే ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. భర్త పరాయి స్త్రీల మోజులో పడి తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని విసిగిపోయిన ఓ భార్య.. క్షణికావేశంలో అతనిపై వేడి నూనె పోసింది. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని కుల్సుంపూరా లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విజయవాడలో ని సింగ్ నగర్ చెందిన గిరిధర్ లాల్(50), రేణుక(40)దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. గిరిధర్ అక్కడ మాంసం వ్యాపారం నిర్వహిస్తుండే వాడు. అయితే పిల్లల చదువుల నిమిత్తం మూడు సంవత్సరాళ్ల క్రితం ఆయన కుటుంబం హైదరాబాద్ నగరానికి వెళ్లింది. అక్కడ జియాగూడలోని కబేళా లో గిరిధర్ లాల్ పనిచేస్తూ దరియాబాగ్ లో ఉంటున్నాడు. కొన్నేళ్లుగా గిరిధర్ లాల్ పరాయి స్త్రీలతో గడుపుతుండే వాడని, వారి వ్యామోహంలో పడి గిరిధర్.. భార్య పిల్లలను పట్టించుకోవడం మానేశాడని రేణుక ఆరోపించింది. తమ పట్ల బాధ్యతారాహితంగా వ్యవహరిస్తున్నాడని భార్య ఆరోపిస్తున్నారు. ఐదు నెలలుగా ఓ మహిళ వద్దే ఉంటూ, మూడు రోజుల కిందటే తమ ఇంటి వచ్చాడని ఆమె చెబుతున్నారు.
ఈక్రమంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ఉదయం వారిద్దరు మరోసారి గోడవ పడ్డారు. గిరిధర్ ప్రవర్తనతో విసిగిపోయిన రేణుక క్షణికావేశంలో వంటింట్లో బాండీలో ఉన్న వేడి నూనెను భర్త గిరిధర్ తలపై పోసింది. గిరిధర్ లాల్ తల, ఛాతీ, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిసోన్నారు. రేణుకను పోలీసులు అదుపులోకి తీసుకుని వాచారిస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.