ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు యువత ఇంట్లో పెద్ద వాళ్లు ఓ చిన్నమాట అన్నాకూడా భరించలేకపోతున్నారు. సెల్ ఫోన్లు కూడా యువతలో అసహనం పెరగడానికి ప్రధానం కారణంగా ఉన్నాయి. వీటి విషయంలో ఇళ్లలో గొడవలు జరిగి ఆత్మహత్యలకి దారి తీసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. సెల్ ఫోన్ వివాదం తాజాగా ఓ వివాహితను బలితీసుకుంది. ఆమెను మొబైల్ అతి వాడొద్దని చెప్పడమే తప్పు అయింది. ఆ విషయంలో భర్తతో వాగ్వాదం దిగి..చివరికే ఆమె మనస్తాపం చెంది భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన ప్రసాద్ రెడ్డికి, విజయవాడకు చెందిన కె.శైలు(20)తో ఈ ఏడాది అక్టోబరులో వివాహం జరిగింది. వీరిద్దరు హైదరాబాద్ లోని చింతల్ ప్రాంతంలో సాయినగర్ లో కాపురం పెట్టారు. ప్రసాద్ రెడ్డి గాంధీనగర్ పారిశ్రామికవాడలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే శైలు పెళ్లికి ముందు నుంచి ఫోన్లు ఎక్కువగా ఉపయోగించే అలవాటు ఉన్నట్లు సమాచారం. టిక్‌టాక్, రీల్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతుండేది. ఫోన్ విషయంలో ఆమె తల్లిదండ్రులు పలుమార్లు హెచ్చరించారంటా. అయినా కూడా శైలు మొబైల్ ఉపయోగించడాని తగ్గించలేదు. అలానే పెళ్లైన తరువాత కూడా శైలులో ఎలాంటి మార్పు రాలేదు. కొన్ని రోజుల పాటు ప్రసాద్ రెడ్డి చూస్తూ వచ్చాడు. సెల్ ఫోన్ ను ఎక్కువ ఉపయోగించ వద్దని ఆమెతో కు చెప్పాడు. అయినా కూడా శైలు ఫోన్ ఎక్కువగా వినియోగిస్తుండేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరిగేది.
ప్రసాద్..శైలు సెల్ ఫోన్ పాస్ వార్డ్ మార్చేశాడు. అయితే తనకు ఫోన్ పాస్ వార్డ్ చెప్పాలని లేకుండా ఆత్మహత్య చేసుకుంటాన్ని శైలు అన్నట్లు సమాచారం. శైలు విషయాన్ని ఆమె తల్లిదండ్రులు ప్రసాద్ రెడ్డి తెలియజేశాడు. వారు కూడా శైలును సెల్ ఫోన్ విషయంలో మందలించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మనస్తాపం చెందిన శైలు గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో భవనంపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకుంది. అయితే, శైలు భవనంపై నుంచి కిందపడి మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భర్తే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడా?, లేదా ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.