నేటి కాలంలో పిల్లల్లో ప్రతి చిన్న విషయానికి గొడవపడే తత్వం బాగా పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకే కొట్టుకోవటం చేస్తున్నారు. కొన్ని సార్లు చంపుకోవటం కూడా జరుగుతుంది. తాజాగా, క్లాస్ రూంలో విద్యార్ధుల మధ్య చోటుచేసుకున్న ఓ చిన్న ఘర్షణ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో బుధవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ కృష్ణానగర్‌కు చెందిన మన్సూర్, సాయి కృప స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్నాడు. గతంలో క్రికెట్ ఆటలో కొంత మంది పదవ తరగతి విద్యార్థులతో మన్సూర్‌కు గొడవ అయింది. ఈ క్రమంలో బుధవారం మరో సారి వారితో గొడవపడ్డాడు.
కొందరు విద్యార్థులు తరగతి గదిలో మన్సూర్ పై బాటిల్స్‌తో దాడి చేశారు. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న స్కూల్ యజమాన్యం గాయపడ్డ మన్సూర్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రి వెళ్లే మార్గం మధ్యలోనే అతడు మరణించాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆహ్లదంగా ఉండాల్సిన వయస్సులో ఆవేశాలకు పోయి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.