భార్యభర్తలు మధ్య గొడవలు సహజం. ఒకరు అలిగి కూర్చుంటే మరొకరు దగ్గరకు వెళ్లి ఓదార్చాలి. ఇదే సంసార జీవితం అంటే. కానీ కొన్ని జంటలు ఇలా కాకుండా ప్రతి చిన్న విషయానికి పెద్దగా గొడవ పడతుంటారు. కొందరైయితే అనుమానం అనే భూతంతో ప్రతి చిన్న విషయానికి ఒకరిపై మరొకరు గొడవ పడుతుంటారు. కొందరు భర్తలైతే అనుమానంతో భార్యలపై దారుణాలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ భర్త పని మీద బయటికి వెళ్లి ఆలస్యంగా ఇంటికొచ్చాడు. బెడ్ రూం తలుపు తట్టినా భార్య ఎంతకీ తీయలేదు. మనోడు అసలకే అనుమానపు పిశాచి కావడంతో తలుపులను మరింత గట్టిగా బాదాడు. ఆ తర్వాత అతడు చేసిన పని వాళ్ల సంసారాన్ని ఛిన్నభిన్నమైంది. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
గుజరాత్ రాష్ర్టంలోని అహ్మదాబాద్ జిల్లాలోని షాపూర్ ప్రాంతంలో ఓ భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి 2019లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఏడాది వయసున్న కొడుకు ఉన్నాడు. భర్తకు అనుమానం అనే జబ్బు ఉంది. దీంతో ప్రతి చిన్న విషయంలో భార్యను అనుమానిస్తుంటాడు. ఆమె ఏ పని చేసిన, ఎలా ఉన్న అనుమానంతో విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. అయిన సదరు మహిళ అతడిని భరిస్తూ వస్తుంది. ఈ భర్త పని నిమిత్తం నిత్యం బయటికి వెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఇంటికి ఆలస్యంగా కూడా వస్తుంటాడు.
ఎప్పటి లాగే అతడు ఓ రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. బెడ్ రూం తలుపు కొట్టగా భార్య ఎంతకీ తలుపు తీయలేదు. దీంతో అనుమానంతో మనోడు తలుపు తీయమని పెద్ద పెద్దగా అరిచాడు. కానీ, ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కోపంతో మరింత గట్టిగా తలుపులను బాదడం. కాసేపటికి తలుపు తెరచిన భార్యపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంట్లోకి వెళ్లి అటూ ఇటూ చూశాడు. గదిలోని అన్ని మూలలను తీక్షణంగా పరిశీలించాడు. ఇంతసేపు తలుపు తీయకుండా ఏం చేస్తున్నావ్.. లోపల ఎవరున్నారంటూ ఆమెపై విరుచపడ్డాడు.
పడుకుని ఉండడంతో తలుపు సౌండ్ వినిపిచ లేదని, అందుకే తలుపు తీయడం ఆలస్యమైందని భార్య చెబుతున్నా.. అతగాడు ఏ మాత్రం వినిపించుకోలేదు. అనుమానపు భూతం తలకెక్కింది. దీంతో, మరింత కోపంతో భార్యను బలంగా నేలకేసి కొట్టి, గొంతు పట్టుకుని చంపడానికి కూడా ప్రయత్నించాడు. దీంతో ఏమి చేయాలో పాలుపోక ఆ ఇల్లాలు పోలీసులను ఆశ్రయించి భర్తపై ఫిర్యాదు చేసింది. వివిధ సాకులు చూపి నిత్యం ఇలానే దాడి చేస్తుంటాడని వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాగుబోతు భర్తతోనైనా సంసారం చేయవచ్చు కానీ అనుమానపు భర్తతో ఏ భార్య సంసారం చేయలేదు. అలాంటి భార్యలకు నిత్యం నరకమే. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.