కొంత మంది ప్రభుత్వ అధికారులు సామాన్య ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాల్సింది పోయిం.. వారిపైనే బెదిరింపులకు పాల్పడుతుంటారు. చనిపోయిన కుమారుడి విషయంలో తనకు న్యాయం జరగాలని ఓ తల్లి, కుటుంబ సభ్యులతో కలసి రోడ్డుపై ధర్న చేసింది. అక్కడికి వచ్చిన ఓ మహిళ అధికారిని..” చెప్పింది చాలు నోరు ముయ్యి”… అంటూ చనిపోయిన బాలుడి తల్లిపై విరుచుకుపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలోని మోదీనగర్ కు చెందిన అనురాగ్ భరద్వాజ్ అనే బాలుడు స్థానిక ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్కూల్ బస్సులో పాఠశాలకు బయలుదేరాడు. మధ్యలో వాంతులు అవుతుంటే బస్సు కిటికీ నుంచి తల బయటకి పెట్టాడు.ఆ విషయం బస్సు డ్రైవర్ గమనించలేదు. ఈ క్రమంలో ఒక స్తంబాన్ని.. విద్యార్థి తల బలంగా ఢీకొట్టడంతో అక్కడిక్కకడే మరణించాడు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే సదరు పాఠశాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
దీంతో విద్యార్థి తల్లిదండ్రులు గురువారం కుటుంబ సభ్యులతో కలసి ఆ పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న మోదీనగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ శుభాంగి శుక్షా అక్కడకు వచ్చారు. “చెప్పింది చాలు నోరు ముయ్యి” అంటూ బాలుడి తల్లిపై మండిపడింది. దీంతో స్థానికుల ఆమెపై ఎదురు తిరిగారు. మరోవైపు యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఈ ఘటనపై స్పందించారు. ఆ బాలుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.