నేటికాలంలో ఆస్తుల కోసం దారుణాలకు పాల్పడే వారు ఎక్కువయ్యారు. ఆస్తుల కోసం కొందరు ఎన్నో నాటకాలు ఆడుతుంటారు. మరికొందరు హత్యలకు పాల్పడుతున్నారు. ఇక కొన్ని కుటుంబాల్లో సైతం ఆస్తుల కోసం వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ మహిళ.. వివాదంలో ఉన్న ఆస్తిని దక్కించుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసింది. న్యాయ వివాదంలో ఉన్న ఆస్తిని ఎలాగైన దక్కించుకోవాలని..తనపై సాముహికంగా అత్యాచారం చేశారంటూ ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన ఓ 36 ఏళ్ల మహిళ తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నలుగురు యువకులు తనను కిడ్నాప్ చేసి సాముహికంగా తనపై అత్యాచారం చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో స్థానికంగా సంచలనగా మారింది. దీంతో మహిళ కమిషన్ కూడా వెంటనే స్పందించింది. నిందితులను పట్టుకుని బాధిత మహిళకు త్వరగా న్యాయం చేయలని పోలీసులకు లేఖ రాసింది. దీంతో ఘటనపై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆ మహిళను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. అనంతరం నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేసి మరీ నేరస్థుల కోసం వెతికారు. ఆ బాధితురాలు చెప్పిన నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో వైద్యపరీక్షల నివేదకలు వచ్చాయి. అందులో పోలీసులకు విస్తుతపోయే నిజాలు తెలిశాయి. బాధితురాలిపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లేమీ కనిపించలేదని ఆ నివేదికలో తేలింది. ఆమెకు వైద్య చికిత్సలు అందించిన ఢిల్లీ జీటీబీ ఆస్పత్రి ఆమెకు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని తేల్చిచెప్పింది. దీంతో ఈ కేసుపై మరింత లోతుగా పోలీసులు విచారణ చేపట్టారు. న్యాయ వివాదంలో ఉన్న ఆస్తిని దక్కించుకోవడం కోసం తన భాయ్ ఫ్రెండ్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచార నాటక మాడినట్లు సదరు మహిళ వెల్లడించింది.
ఆమెతో వాళ్లకు ఆస్తి తగాదాలు ఉండడంతో నిందితులుగా భావించే వారిపై ఉద్దేశపూర్వకంగానే మహిళ కేసు పెట్టిందని వెల్లడైంది. దీంతో పోలీసులను తప్పుదోవ పట్టించిన సదరు మహిళను కఠినంగా శిక్షించాలంటూ మహిళా కమిషన్ పోలీసులకు లేఖ రాసింది. వారిపై చీటింగ్ కేసుతో సహా పలు సెక్షన్ల కింద కేసు పెట్టి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. జడ్జి వారిని 14 రోజుల కస్టడీకి ఆదేశించారు. ఆస్తి కోసం తనను రేప్ చేశారంటూ మహిళ ఆడిన నాటకం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా వైరల్ గా మారింది.