భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థకు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ కొందరు వ్యక్తులు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఆ వివాహ వ్యవస్థకు భంగం కలిగిస్తున్నారు. అక్రమ సంబంధాల మోజులో పడి ఏకంగా వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. కొందరు మహిళలు అయితే భర్తలను వదిలేసి పరాయి వారితో సహజీవనం చేస్తుంటారు. ఈక్రమంలో జరిగే కొన్ని పరిణామాలతో హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఓ వివాహిత భర్తను వదిలేసి మరొక వ్యక్తితో సహజీవనం చేసింది. పెళ్లికి నిరాకరించడంతో అతడిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ప్రీతిశర్మ(35) గతంలో దీపక్ యాదవ్ అనేక వ్యక్తితో పెళ్లై.. మనస్పర్ధల కారణంగా భర్తతో విడిపోయింది. క్రమంలో ఢిల్లీకి వెళ్లి అక్కడ నివాసం ఉంటుంది. అక్కడ సెలూన్ షాపులో పనిచేస్తున్న మహ్మద్ ఫిరోజ్ (22)తో ప్రీతి శర్మకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ఇద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. అలా నాలుగేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామని ప్రీతి శర్మ, ఫిరోజ్ ను కోరింది. అయితే ప్రీతితో పెళ్లి ఫిరోజ్ నిరాకరించాడు. ఇదే విషయమై శనివారం రాత్రి ఇరువురి మధ్య మరోసారి గొడవ చోటు చేసుకుంది.
దీంతో విచక్షణ కోల్పోయిన ప్రీతిశర్మ.. అక్కడే ఉన్న రేజర్ బ్లేడ్ తో ఫిరోజ్ గొంతు కోసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.దీంతో ఏమి చేయాలో అర్ధం కాక ఆ మృతదేహాన్ని ఆదివారం మొత్తం గదిలోనే ఉంచింది. తర్వాత సీలంపూర్ మార్కెట్ కు వెళ్లి పెద్ద ట్రాలీ బ్యాంగ్ ను కొనుగోలు చేసింది. ఆ ట్రాలీ బ్యాంగ్ లో మృతదేహాన్ని పెట్టి అర్ధరాత్రి తర్వాత ఘాజియాబాద్ రైల్వే స్టేషన్‌కు బయలుదేరింది. తన ఫ్లాట్ నుంచి ట్రాలీతో బయటకు వచ్చిన ప్రీతి శర్మ ఆటో కోసం ఎదురు చూస్తోంది.
ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కంటపడింది. ఆమె తీరు అనుమానాస్పదంగా ఉండటంతో ట్రాలీను తెరవమని చెప్పాడు. అందులో మృతదేహం చూసి కానిస్టేబుల్ షాకయ్యాడు. తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.