సమాజంలో ఎవరైన తప్పు చేస్తే వారిని శిక్షించడానికి పోలీసులు, కోర్టు అనేవి ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అక్కడి ప్రజలే నిందితులకు శిక్షలు విధిస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కేవలం అనుమానంతో కూడ శిక్షలు విధిస్తుంటారు. ముఖ్యంగా మహిళ విషయంలో అలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి మృతికి కారకురాలని అనుమానిస్తూ ఓ మహిళను ఘోరంగా అవమానించారు.
మానవుడు సృష్టించిన అద్భుతాలతో సమాజం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. అయితే ఇలాంత అభివృద్ధిలో పరుగులు పెడుతున్న ఆధునిక సమాజంలోనూ అక్కడక్కడ ఆకృత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరైన తప్పు చేస్తే పోలీసులు, కోర్టులు శిక్షిస్తాయి. అయితే కొన్ని ప్రాంతంలో అక్కడి ప్రజలే శిక్షించే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇక శిక్షలు వేసి విషయంలో ముఖ్యంగా మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి మృతికి కారణమైందంటూ ఆరోపిస్తూ మహిళను సమీప బంధువులే ఘోరంగా అవమానించారు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ప్రాంతంలోని తండాలో సోమవారం ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. డోర్నకల్ పట్టణ పరిధిలోని మున్నేరు వాగు సమీపంలోని శివాలయం వద్ద ఫిబ్రవరి 10న కుళ్లిన స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలోని పరిసర ప్రాంతాలను పోలీసులు క్షణంగా పరిశీలించారు. అనంతరం అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి.. అక్కడే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడు డోర్నకల్ శివారు తండావాసిగా ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు.
ఇలా ఈ కేసు గురించి పోలీసులు విచారణ ఒకవైపు జరుగుతుండగా తండాలో ఓ ఘోరం చోటుచేసుకుంది. ఆ వ్యక్తి మృతికి కారణమంటూ అదే తండాకు చెందిన మహిళపై మృతుడి సమీప బంధువులు దాడి చేశారు. ఆమెను తీవ్రంగా కొట్టడమే కాకుండా మెడలో చెప్పుల దండవేసి అవమానించారు. చెప్పుల దండతోనే మహిళను తండా అంత తిప్పినట్లు సమాచారం. సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటనపై అందరు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై డోర్నకల్ పోలీసుల వద్ద ప్రస్తావించగా విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు.
ప్రస్తుతం మృతదేహం గుర్తింపు కేసును అన్ని కోణాల్లో నుంచి దర్యాప్తు చేస్తునట్లు ఆయన చెప్పారు. మహిళపై జరిగిన ఈ దాడి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నిజంగా ఏదైన తప్పు చేసి ఉంటే శిక్షించడానికి పోలీసులు, కోర్టు ఉందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి.. ఆధునిక సమాజంలో కూడా జరుగుతున్న ఇలాంటి ఆకృత్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.