ప్రపంచంలో ప్రేమకు ఉన్న శక్తి ఎంతో అందరికి తెలిసిందే. అయితే ఎందరో ప్రేమించుకుంటారు.. కానీ వారిలో కొందరు మాత్రమే పెళ్లి పీటల వరకు వెళ్తుంటారు. అంతేకాక కొన్ని ప్రేమ కథలు విషాదాంతం అవుతుంటాయి. తాజాగా నల్గొండలో జరిగిన ఓ ప్రేమ కథ విషాదంతో ముగిసింది.
ప్రేమ అనే రెండు అక్షరాల పదంకు ఎంతో శక్తి ఉంది. ప్రేమ అనేది మనిషిని శక్తివంతుడిగానైనా మార్చగలదు.. అలానే బలహీనుడిగా కూడా చేయగలదు. అంతేకాక ఇదే ప్రేమ మనిషి మృగంలా కూడా మారుస్తుంది. అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన ఓ హత్యొదంతమే అందుకు ఉదాహరణ. ప్రేమ మైకంలో పడి ఓ వ్యక్తి సైకోలా మారి.. ప్రాణ స్నేహితుడినే అత్యంతం దారుణంగా హత్య చేశాడు. ఇలా ప్రేమ కారణంగా హత్యలు, ఆత్మహత్యలు తరచూ జరుగుతుంటాయి. తాజాగా నల్గొండ జిల్లాలో ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి.. ఆ తరువాత చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామానికి చెందిన అందుగుల భిక్షమయ్య, మార్తమ్మ దంపతుల కుమారుడు రాకేశ్(20) డిగ్రీ చదువుతూ మధ్యలేనే వదిలేశాడు. ఆతరువాత స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. సీన్ కట్ చేస్తే.. కొండమల్లేపల్లి మండలం దోనియాల గ్రామానికి చెందిన వరికుప్పల కృష్ణయ్య, జయమ్మ దంపతుల కుమార్తె దేవి(16) దేవరకొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే ఇలా వేరు వేరు గ్రామాలకు చెందిన వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది.
గతేడాది చింతపల్లి మండలం పరిధిలోని మోడల్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న సమయంలో దేవికి రాకేశ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అలా ఏడాది పాటు ప్రేమించుకున్న వారిద్దరు.. తమ ప్రేమను పెద్దలకు చెప్పాలని భావించారు. ఈక్రమంలో ఇటీవల ఇరువురూ తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు. వీరి ప్రేమపై రాకేశ్ కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించగా, యువతి తరపు బంధువులు మాత్రం నిరాకరించారు. ఈ క్రమంలోనే యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆదివారం రాకేశ్ కు ఫోన్ చేసిన దేవి.. తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, నిన్ను కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుని బతకలేనని, వచ్చి తీసుకెళ్లమని కోరింది. దీంతో అదే రోజు సాయంత్రం రాకేశ్, దేవిలు తమ ఇళ్ల నుంచి పారిపోయి నేరెడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గ్రామం సమీపంలోని ఉచ్చల బుడ్డి వద్దకు చేరుకున్నారు.
ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని తమ వెంట పురుగుల మందు తీసుకెళ్లారు. అక్కడి వెళ్లిన తరువాత పురుగులు మందు తాగి ఆపై చెట్టుకు తాడుతో ఉరి వేసుకున్నారు. చాలా సమయం తరువాత అటుగా వెళ్లిన గ్రామస్తులు రాకేశ్, దేవిల మృతదేహాలను చూశారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఓ సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులు క్షమించాలని ఆ నోట్ రాసి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.